210క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
Published Mon, Feb 10 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
బాపట్ల టౌన్, న్యూస్‌లైన్ :రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. బాపట్ల మండలం అప్పికట్ల సమీపంలో 90 క్వింటాళ్లు, సత్తెనపల్లి మండలం వెన్నాదేవి వద్ద 120 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. కాకుమాను మండలం నుంచి కృష్ణా జిల్లా మోపిదేవికి అక్రమంగా తరలివెళుతున్న రేషన్ బియ్యాన్ని అప్పికట్ల సమీపంలో ఆదివారం ఉదయం స్వాధీనంచేసుకున్నారు. స్థానిక తాలుకా పోలీస్‌స్టేషన్‌లో విజిలెన్స్ డిఎస్పీ పి.అనిల్‌బాబు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్లపాలెం మండలంలోని షేక్ అబీబ్ అనే వ్యక్తి, పట్టణంలోని పరిశా అంకమ్మరావు, నాగరాజులతో కలిసి కాకుమాను, పరిసర ప్రాంతాల్లోని కొందరు డీలర్ల వద్దనుంచి సుమారు 180 బస్తాల (90 క్వింటాళ్లు) రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం అందింది.
ఆ మేరకు విజిలెన్స్ సిబ్బంది రంగంలోకి లారీని అప్పికట్ల శివారు ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ రూ. 2.25 లక్షలు ఉంటుంది. పట్టపగలు, యథేచ్ఛగా ప్రజాపంపిణీ గోతాల్లోనే బియ్యాన్ని అక్రమంగా తరలించడం గమనార్హం! విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని బాపట్ల పౌరసరఫరాల గోడౌన్‌లో భద్రపరిచి, నిందితులను జేసీ కోర్టుకు హాజరుపరుస్తామని విజిలెన్స్ డీఎస్పీ తెలిపారు. షేక్ అబీబ్, నాగరాజు, అంకమ్మరావులు అనేక పర్యాయాలు రేషన్‌బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన విషయాన్ని జేసీ దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వీరిపై బాపట్ల తాలుకా పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు కూడా నమోదు చేశామన్నారు. బియ్యం స్వాధీనం చేసుకున్నవారిలో తాలుకా ఎస్‌ఐ చెన్నకేశవులు, విజిలెన్స్ సిబ్బంది ఉన్నారు.
రైస్‌మిల్లు నుంచి తరలిపోతున్న వైనం..
వెన్నాదేవి (సత్తెనపల్లి రూరల్): వెన్నాదేవి వద్ద విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆదివారం నిఘా పెట్టి అక్రమంగా లారీలో తరలిస్తున్న 120క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు.. ముప్పాళ్ళ మండలం నార్నెపాడు గ్రామంలోని త్రికోటేశ్వర రైస్‌మిల్లు నుంచి నల్లగొండ జిల్లా హాలియాకు లారీలో వెళ్తున్న 120 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ వెంకటనారాయణను వివరాలు అడిగి కేసు నమోదుచేశా రు. దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ సీఐ కిషోర్‌బాబు, హెడ్‌కానిస్టేబుల్ ఆశీర్వాదం, వీఆర్వో చంద్రశేఖర్ పాల్గొన్నారు. స్వాధీనం చేసుకున్న సరుకును, లారీని సత్తెనపల్లి రూరల్ పోలీసులకు అప్పగిం చారు. డ్రైవర్‌ను సోమవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు రూరల్ ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
Advertisement
Advertisement