వీరబల్లె : వైఎస్ఆర్ కడప జిల్లాలోని వీరబల్లె మండలం నాయునివారిపాలెం వద్ద సోమవారం అక్రమంగా తరలిస్తున్న 22 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అంచనా. ఈ ఘటనకు సంబంధించి 10 మందిని అరెస్ట్ చేశారు. ఒక వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తుండగా ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. కేసు నమోదు చేసుకుని నిందితులను స్టేషన్‌కు తరలించారు.