
70 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, ముగ్గురి అరెస్ట్
కడప: ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్చగా కొనసాగుతోంది. స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణాకు పాల్పడుతూనే ఉన్నారు. వీరి ఆగడాలను అరికట్టేందుకు అటవీశాఖ అధికారులు, పోలీసులు ఎప్పుటికప్పుడూ చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. తాజాగా కడప జిల్లాలోని ఒంటిమిట్టలో అక్రమంగా తరలిస్తున్న 70 ఎర్రచందనం దుంగలను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్థానిక కోదండ రామాలయం వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలను గమనించి ఓ టెంపో వాహనం ఆగకుండా వెళ్లడంతో పోలీసులు వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. వాహనం సహా, 70 దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు మండలంలోని నరవకాటిపల్లె చెందిన వారిగా గుర్తించారు.
(ఒంటిమిట్ట)