
సాక్షి, తుని: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 236వ రోజు సోమవారం తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని డి. పోలవరం నుంచి ప్రారంభమైంది. జననేత వెంట నడిచేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
తాటిపాక, బిళ్లనందూరు క్రాస్, బొడ్డువరం క్రాస్, జగన్నాథపురం, కోటనందూరు మీదుగా కాకరాపల్లి వరకు ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ జగన్ రాత్రికి అక్కడే బస చేస్తారు. కాగా వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఆయన పాదయాత్ర సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment