హైదరాబాద్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్రలోని దాదాపు 40వేల మంది ప్రైవేటు వైద్యులు బంద్కు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం నుంచి తమ ఆసుపత్రులను పూర్తిగా బంద్ చేస్తున్నారు. అయితే అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఇచ్చారు. ప్రయివేట్ డాక్టర్లకు మద్దతుగా అన్ని రకాల రక్తపరీక్ష కేంద్రాలను సైతం మూసివేస్తున్నారు. ప్రైవేటు వైద్యులు తమ ఆందోళనలో భాగంగా వైద్య కళాశాలలను కూడా మూసివేయిస్తున్నారు. సీమాంధ్ర జిల్లాల్లో ప్రతిచోట భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు సీమాంధ్ర జెఎసి కన్వీనర్ పివి రమణమూర్తి తెలిపారు.