షార్‌ సెంట్రల్ స్కూల్ లో లైంగిక వేధింపులు | 3 teachers suspended in Satish Dhawan Space Centre central school | Sakshi
Sakshi News home page

షార్‌ సెంట్రల్ స్కూల్ లో లైంగిక వేధింపులు

Published Fri, Apr 1 2016 12:06 PM | Last Updated on Wed, Sep 26 2018 6:09 PM

3 teachers suspended in  Satish Dhawan Space Centre central school

సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా షార్  సెంట్రల్ స్కూల్ లో లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినులను, సిబ్బందిని వేధిస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాలు.. కేంద్రీయ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిల పట్ల కొందరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించారు. పరీక్షల సందర్భంగా వేధింపులు ఎక్కువవడంతో విద్యార్థినులు ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో వారు పాఠశాలలోని లలితకుమారి కమిటీకి ఉపాధ్యాయుల తీరుపై ఫిర్యాదు చేశారు. కమిటీ విచారణ చేపట్టి గర్భోజి, షణ్ముఖ సుందరం, కృష్ణప్రసాద్ అనే ముగ్గురు ఉపాధ్యయులు బాలికలను లైంగికంగా వేధిస్తున్నారని గుర్తించారు. షార్ కంట్రోలర్ దేవిరాజారెడ్డి ఆ ముగ్గురు ఉపాధ్యాయులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement