నాగార్జున సాగర్, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి 300 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పర్యాటశాఖ ఈడీ మధుసూదన్ చెప్పారు. సాగర్ లాంచీ స్టేషన్‌లో నూతనంగా చేపట్టిన నాగసిరి లాంచీ నిర్మాణ పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పర్యాటకులతో కలిసి లాంచీలో నాగార్జున కొండకు వెళ్లారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. టూరిజం అభివృద్ధిలో బీచ్ కారిడర్, రిసార్ట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని కోసం హైదరాబాద్‌లోని దుర్గం చెరువు, సామీర్‌పేట, శ్రీకాకుళం, నెల్లూరు పట్టణాలను ఎంపిక చేశామన్నారు. సాగర్ విజయవిహార్‌లో జెట్టి పాయింట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్‌లో నాగసిరి లాంచీ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. బుద్ధవనం అభివృద్ధికి కేంద్రం నుంచి మరో *6కోట్లు మంజూరు కానున్నాయన్నారు. ఆయన వెంట డీఎం నాగేశ్వర్‌రావు, డీవీఎం జోయల్ తదితరులు ఉన్నారు