ఇతిహాస పరిమళం ‘ఇంగువ’
హైద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ సూపరింటెండెంట్‌గా, ఇన్‌చార్జ్‌గా పనిచేసిన ఐ.కె.శర్మ రాష్ట్రంలోని పురావస్తు స్థలాలన్నిటినీ సందర్శించారు. లేపాక్షి బసవయ్యకు వేదిక నిర్మించారు. దేశంలో తొలి శివాలయం గుడిమల్లంలో ఉందని నిర్ధారించి ఆలయానికి హద్దులు ఏర్పరచారు.
మన రాష్ట్రం భారత పురావస్తుశాఖ నిఘంటువుకు రెండు పదాలను చేర్చింది. ఒకటి ‘తరలింపు’ మరొకటి ట్రాన్స్ ప్లాంటేషన్ (మరోచోట పునః ప్రతిష్టించడం). నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రతిపాదనల నేపథ్యంలో నంది కొండ తదితర గ్రామాల్లో ముంపునకు గురికానున్న బౌద్ధ- వైదికమత శిల్పాలను దేశంలో తొలిసారి తరలిం చారు. నాగార్జునకొండలో ఆ శిల్పాలు సందర్శనీయాలు. దేశంలో తొలిసారిగా మహబూబ్‌నగర్ జిల్లాలోని ‘కూడలి’ సంగమేశ్వర ఆలయాన్ని ‘ట్రాన్స్‌ప్లాంట్’ చేశా రు. ఈ రెండు అపూర్వ ఘట్టాలలోనూ ఐ.కె.శర్మగా అం దరికీ తెలిసిన ఇంగువ కార్తికేయశర్మ (అక్టోబర్ 21-1937 -నవంబర్ 28-11-2013 ) చిరస్మరణీయుడు.
రాళ్లెత్తిన కూలీ!
నెల్లూరుజిల్లా పల్లెపాడులో జన్మించిన శర్మ ‘వచ్చిందోయ్ వచ్చింది నందికొండ నాగార్జున సాగరమొచ్చింది’ అని జానపదులతో కలసి బృందగానం చేస్తూ పురావస్తు తవ్వ కాల్లో ‘రోజు కూలీ’గా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించారు. ప్రైవేటుగా బిఏ చదివి టెక్నికల్ అసిస్టెంట్ అయ్యారు. నాగపూర్‌లోని తవ్వకాల విభాగంలో పని చేస్తూ, ఆఫీసుకు వచ్చే ముందు ఉదయం 6 నుంచి 9 గంటల వరకూ క్లాస్ లకు వెళ్లి ఎంఏలో గోల్డ్ మెడల్ సాధించారు. తమకు గౌరవం తెచ్చిన వినయవంతుడైన శిష్యుడుగా ఎస్.బి. దేవ్, అజయ్ మిశ్రాలు ఐ.కె.శర్మను అభివర్ణించేవారు.
ప్రతిచోటా ‘ముద్ర’
హైద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ సూపరింటెండెంట్‌గా, ఇన్ చార్జ్‌గా పనిచేసిన ఐ.కె. రాష్ట్రంలోని పురావస్తు స్థలాలన్ని టినీ సందర్శించారు. లేపాక్షి బసవయ్యకు వేదిక నిర్మిం చారు. దేశంలో తొలి శివాలయం గుడిమల్లంలో ఉందని నిర్ధారించి ఆలయానికి హద్దులు ఏర్పరచారు. ఏలూరు సమీపంలోని పెదవేగి, గుంటుపల్లిలోని బౌద్ధారామాలను వెలుగులోకి తెచ్చారు. రైతులతో సంప్రదించి భూమి తగా దాలను పరిష్కరించి పురావస్తు కేంద్రంగా పర్యాటక చిత్ర పటంలో చేర్చడంలో ఆయన శైలి అనన్యం!
పరిశోధకులకు ప్రామాణిక గ్రంథ కర్త
ప్రపంచవ్యాప్తంగా అన్ని ముఖ్యమైన విశ్వవిద్యాలయా లు, గ్రంథాలయాల్లో ఆయన పుస్తకాలు రిఫరెన్స్ గ్రంథా లుగా ఉన్నాయి. ‘ఆర్టిఫిషియల్ వాటర్ సిస్టమ్స్ ఇన్ ఏనిషి యంట్ అండ్ మిడీవల్ ఇండియా (పురాతన-మధ్యయు గాల్లో కృత్రిమ నీటిసరఫరా విధానాలు)-సిటీ గాడెసెస్ ఫ్రం వేంగీపుర (వేంగిపురపు నగర దేవతలు) శ్రీసుబ్రహ్మ ణ్యస్మతి, నరసింహస్మృతి (శాసన లిపి-నాణెముల శాస్త్రం -కళ-వాస్తు నిర్మాణాలు-ఐకనోగ్రఫీ-సాంస్కృతిక చరి త్రల సంపుటి), బ్రాహ్మినికల్ బ్రిక్ టెంపుల్స్ అండ్ కల్ట్ ఆబ్జెక్ట్స్ ఫ్రం కీసరగుట్ట-బుద్దిస్ట్ మాన్యుమెంట్స్ ఆఫ్ చైనా అండ్ సౌత్ ఈస్ట్ ఇండియా- కాయినేజ్ ఆఫ్ ద శాతవా హన ఎంపైర్, రూట్స్ ఆఫ్ ఇండియన్ సివిలిసైజేషన్ తదితర గ్రంథాలను ఆయన రచించారు.
అబుసింబల్-అలంపురం
ప్రపంచంలో తొలి ట్రాన్స్‌ప్లాంటేషన్ ఈజిప్ట్‌లోని అబుసిం బల్. రెండవది మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపురం. మరణానంతర నివాసం కోసం తమ జీవితకాలంలో ఈజిప్ట్ చక్రవర్తి రెండవ ఫారోస్ రామ్‌సేస్, అతని భార్య నెఫర్తరి క్రీ.పూ.13వ శతాబ్దంలో నిర్మించిన అబుసింబల్ కు నైలునదిపై ఆస్వాన్ డ్యాంతో ముంపు ప్రమాదం ఏర్ప డింది. ఈ నేపథ్యంలో యునెస్కో ఆధ్వర్యంలో 50 దేశాల పురావస్తు బృందాలు 1960ల్లో ఆ కట్టడాలను ట్రాన్స్ ప్లాంట్ చేశాయి. ఆ క్రమం లో పెద్ద శిల్పాలను పగులగొట్టి పునః నిర్మాణంలో స్టీల్ రాడ్లతో అతికించారు. భారీ యంత్రాలను వాడి 40 మిలి యన్ల డాలర్లు ఖర్చుపెట్టారు. అటువంటి ప్రమాదమే మహబూబ్‌నగర్ జిల్లా, ‘కూడలి’ గ్రామంలో క్రీ.శ. 6వ శతాబ్దంలో మొదటి విక్రమాదిత్యుడు నిర్మించిన ఆల యానికి శ్రీశైలం జలవిద్యుద్కేంద్ర నిర్మాణ నేపథ్యంలో ఏర్పడింది.
కృష్ణ-తుంగభద్ర సంగమస్థలిలోని కూడలి సంగమే శ్వరాలయం భారతదేశంలోని అన్ని శిల్పసంప్రదాయాల కూడలి కూడా! ఉత్తరాదికి చెందిన ‘నాగరి’ శైలి, తూర్పు నకు చెందిన ‘జగతి’ ద్రవిడ రీతులు అన్నీ కలసిన ‘వేసరి’ శైలి ఈ ఆలయ ప్రత్యేకత! ఈ ఆలయాన్ని ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని పురావస్తుశాఖలో డెరైక్టర్‌గా పనిచేస్తోన్న ఐ.కె. శర్మ, డెరైక్టర్ జనరల్ జగపతి జోషిని ఒప్పించారు. పరిసర గ్రామాల ప్రజల సహకారంతో, భారీ యంత్రాలేమీ వాడ కుండా, రాయివెంట రాయిని సశాస్త్రీయంగా వెలికితీసి, ఎడ్లబండ్లపై తరలించి పునః నిర్మాణం చేయించారు ఐ.కె. శర్మ. కేవలం 31 లక్షల రూపాయల ఖర్చుతో! 14 శతా బ్దాల తర్వాత 1990 ఫిబ్రవరి 23న శివరాత్రిరోజు కూడలి సంగమేశ్వరుని పునః ప్రతిష్ట జరగడాన్ని స్థానికులు తాజా సంఘటనగా చెప్పుకుంటారు. ఇటీవల నర్మద వ్యాలీలోని 30 పురావస్తు నిర్మాణాలను తరలించేందుకు పురావస్తు శాఖలోని అన్ని విభాగాల్లో విశేష అనుభవం ఉన్న ఐ.కె. శర్మ ముందుచూపు ఉపకరించిదని ఆ శాఖ ఉన్నతాధికా రులు పేర్కొన్నారు.
శ్రీపాద ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల; పులిచింతల కారణంగా గుంటూరుజిల్లా మోర్జంపాడు గ్రామ సమీపంలోని బుగ్గ మల్లయ్య ఆలయం ముంపునకు గురికానున్నాయి. ఆయా సాంస్కృతిక నిర్మాణాలను గుర్తించి, తరలించి, పునః నిర్మాణం చేయడమే ప్రామాణిక గ్రంథకర్త, అధ్యాపకుడు అయిన ఐ.కె.శర్మకు పురావస్తుశాఖ ఇవ్వగల ఘనమైన నివాళి!
-పున్నా కృష్ణమూర్తి