టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలోని మెట్‌కోర్ ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమకు చెందిన 300 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. యాజమాన్యం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో లాకౌట్ ప్రకటించింది. పరిశ్రమకు తాళాలు వేయడంతో అందులో రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేస్తున్న 300 మంది కార్మికులు హతాశులయ్యారు. శుక్రవారం ఉదయం వారు పరిశ్రమ వద్దకు చేరుకుని పరిష్కారం కోసం అక్కడే బైటాయించారు. కాగా, యాజమాన్యం అందుబాటులో లేదని సమాచారం.