మచిలీపట్నం టౌన్ : మునిసిపాలిటీలో రాజ కీయ బదిలీలకు తెరలేచింది. ఇక్కడ టీడీపీ పాలకవర్గం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ఇంకా విడుదల చేయలేదు. అయితే మునిసిపాలిటీ పాలకవర్గం అంతర్గత బదిలీలకు శ్రీకారం చుట్టింది. మునిసిపల్ పాఠశాలల సూపర్‌వైజర్‌గా ఉన్న సీహెచ్.వి.కృష్ణారావును తప్పించి ఆ స్థానంలో శ్రీనివాసరావును నియమించారు. పట్టణంలోని పలు పాఠశాలల్లో పనిచేస్తున్న 32 మంది సెకండ్‌గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లను బదిలీ చే శారు.
ఈ బదిలీల ఫైల్‌పై మునిసిపల్ కమిషనర్ ఎ.మారుతిదివాకర్ శుక్రవారం సంతకం చేసినట్లు తెలిసింది. ఈ ఉత్తర్వులతో కొంత మంది ఉపాధ్యాయులు బదిలీ అయినస్థానాల్లో విధుల్లో చేరారని తెలి సింది. గత ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పని చేశారనే కారణంతో కొంత మంది ఉపాధ్యాయులను రాజకీయనాయకుల సూచనల మేరకు దూరాన ఉన్న గిలకలదిండి పాఠశాలకు బదిలీ చేసి, వారికి అనుకూలమైన ఉపాధ్యాయులను నియమించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పాతరామన్నపేట, రాజుపేట ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులను బదిలీ చేసి చేయడంతో అక్కడ లెక్కలు బోధించే ఉపాధ్యాయులు కరువ య్యారు. పాతరామన్నపేట పాఠశాలలో 42 మంది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. వారిలో లెక్కల టీచర్‌ను బదిలీచేసి, కొత్తగా ఇద్దరిని నిమయించారు. 80 మంది విద్యార్థులు ఉన్న బందరుకోట ప్రాథమిక పాఠశాలలో మాత్రం ఇద్దరు ఉపాధ్యాయులను బదిలీ చేసి, ఒకరినే నియమించారు.
బందరుకోట హైస్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయులను బదిలీ చేసి ఒకరినే నియమించారు. గిలకలదిండి ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్, సోషల్ సబ్జెక్టులు భోదించే ముగ్గురు బీఈడీ అసిస్టెంట్లను బదిలీ చేసి, ఎస్‌జీటీలను నియమించారు. వలందపాలెం ఎలిమెంటరీ రెగ్యులర్ పాఠశాలలో 27 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు.
బదిలీల్లో మరొకరిని నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. దేవుని తోట ఎస్టీ ఏరియా పాఠశాలలో 25 మంది విద్యార్థులకు ఇప్పటికే ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా, మరొకరిని నియమిం చారు. బదిలీల్లో జరిగిన పొరపాట్లుపై కమిషనర్ మారుతిదివాకర్‌ను వివరణ కోరాగా పొరపాట్లు జరిగినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. త్వరలో సమీక్షించి సరిదిద్దే ప్రయత్నం చేస్తామన్నారు.
32 మంది మునిసిపల్ ఉపాధ్యాయుల బదిలీ
Published Mon, Aug 4 2014 1:09 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement