తిరుపతి ఎక్సైజ్ జిల్లాల్లోని 458 మద్యం దుకాణాల్లో 349 వాటికి మాత్రమే టెండర్లు వేశారు. మొత్తం 2112 దరఖాస్తులు వచ్చాయి. 109 దుకాణాలకు ఒక్క టెండ రూ పడలేదు.
చిత్తూరు, తిరుపతి ఎక్సైజ్ జిల్లాల్లోని 458 మద్యం దుకాణాల్లో 349 వాటికి మాత్రమే టెండర్లు వేశారు. మొత్తం 2112 దరఖాస్తులు వచ్చాయి. 109 దుకాణాలకు ఒక్క టెండ రూ పడలేదు. టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.5.28 కోట్ల ఆదాయం లభించినట్టు జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ తెలిపారు.
చిత్తూరు ఎక్సైజ్ జిల్లాలో చిత్తూరు అర్బన్ స్టేషన్ పరిధిలో 30 దుకాణాల్లో 23 దుకాణాలకు 147 దరఖాస్తులు, రూరల్‌లో 29 దుకాణాల్లో 20కి 119, కార్వేటినగరంలో 17 దుకాణాల్లో 13కు 159, మదనపల్లెలో 9 దుకాణాల్లో 7కు 247, మొలకలచెరువులో 9 దుకాణాల్లో 7కు 40, పుంగనూరులో 29 దకాణాలకు గాను 20 దుకాణాలకు 104, పలమనేరులో 24కు 20 వాటికి 104, కుప్పంలో 20 దుకాణాలకు గాను 19 దుకాణాలకు 146, పీలేరులో 18కి 17 దుకాణాలకుగాను 46, వాయల్పాడులో 11కు 31 దరఖాస్తులు పడ్డాయి. మొత్తం ఎక్సైజ్ పరిధిలో 214 దుకాణాలకు 179కి మాత్రమే 1116 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మిగిలిన 35 దుకాణాలకు ఎలాంటి టెండర్లు వేయలేదు.
ఇక తిరుపతి ఎక్సైజ్ పరిధిలో తిరుపతి అర్బన్‌లో 44 దుకాణాల్లో 42కు 305, తిరుపతి రూరల్‌లో 30 దుకాణాల్లో 25కు 213 దరఖాస్తులు, పాకాలలో 33 దుకాణాల్లో 15కు 40, నగరిలో 29 దుకాణాల్లో 15కు 48, సత్యవేడులోని 40 దుకాణాల్లో 28కి 59, పుత్తూరులో 31 దుకాణాల్లో 18కి 55, శ్రీకాళహస్తి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 37 దుకాణాల్లో 27 దుకాణాలకు మాత్రమే 276 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం తిరుపతి పరిధిలో 244 దుకాణాలకు గాను 170కి మాత్రమే 996 మంది టెండర్లు దాఖలు చేశారు. మిగిలిన 74 దుకాణాలకు ఒక్క దరఖాస్తూ పడలేదు.