
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 572కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. గడచిన 24 గంటల్లో జరిగిన కరోనా నిర్దారణ పరీక్షల్లో.. కర్నూలు జిల్లాలో 13, నెల్లూరు 6. అనంతపురం 5, చిత్తూరు 5, కృష్ణా 4 , గుంటూరు 4, కడప 1 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 35 మంది డిశ్చార్జ్ కాగా, 14 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 523 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 126 కరోనా పాటిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు.
జిల్లాల వారిగా కరోనా కేసులు..
Comments
Please login to add a commentAdd a comment