![దళితులపై విద్యుత్ చౌర్యం కేసులు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/81464990989_625x300.jpg.webp?itok=POMx4t2b)
దళితులపై విద్యుత్ చౌర్యం కేసులు
► ఎల్లుట్ల ఎస్సీకాలనీలో విజిలెన్స్ అధికారుల నిర్వాకం
► తీవ్ర ఆందోళన చెందుతున్న బాధితులు
పుట్లూరు : పుట్లూరు మండలం ఎల్లుట్ల ఎస్సీకాలనీలో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. విద్యుత్ చౌర్యం చేస్తున్నారంటూ 42 మందిపై కేసులు నమోదు చేశారు. ఒక్కో కుటుంబంపై రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు అపరాధ రుసుం విధించారు. డబ్బు చెల్లించకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో ఎస్సీ కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు అప్పుచేసి మరీ అపరాధ రుసుం చెల్లించారు.
సీపీఎం నాయకుల నిరసన
దళితుల ఇళ్లకు విద్యుత్ మీటర్లు లేవని అపరాధ రుసుం వేయడంపై సీపీఎం మండల కార్యదర్శి రామాంజినేయులు అధికారుల ముందు నిరసన తెలిపారు. వెంటనే కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.