అది చాలదన్నట్లు అధిక డబ్బులు చెల్లించారు. టెండరు వేసిన కంపెనీతో ముందస్తుగానే బేరం కుదుర్చుకున్న పలువురు అధికారులు కోట్ల రూపాయలు దండుకున్నారు. ఎన్పీడీసీఎల్‌లో ఐఆర్‌డీఏ మీటర్ల కొనుగోలుకు సంబంధించిన మరో అవినీతి బాగోతం ఇది. - న్యూస్‌లైన్, వరంగల్
వరంగల్, న్యూస్‌లైన్ : అనవసరంగా కొన్న ఇన్‌ఫ్రారెడ్ డేటా అసోసియేషన్ (ఐఆర్‌డీఏ) మీటర్ల బాగోతంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందుగా టెండర్ల సమయంలోనే ఉన్నతస్థాయిలో పలువురు అధికారులు ఏకమై గోల్‌మాల్‌కు పాల్పడ్డారు. మీటర్లకు టెండరు వేసిన కంపెనీతో కలిసి * కోట్లు పంచుకున్నారు. సీల్డ్ టెండర్లను చింపి... తక్కువ ధర వేసిన కంపెనీతో బేరం కుదుర్చుకున్న అధికారులు వ్యూహాత్మకంగా అదే కంపెనీతో లాలూచీ పడ్డారు. అప్పటి సీఎండీతో సహా... పర్చేజింగ్ అధికారులంతా ఈ బాగోతంలో భాగస్వాములుగా ని లిచారు. ఒక్కో మీటరుకు * 110 చొప్పున అదనం గా చెల్లింపులు చేశారు. పక్క డిస్కంలో తక్కువ ధర కు కొనుగోలు చేసిన మీటరుకు ఈ డిస్కంలో మా త్రం ఎక్కువగా ఖర్చు పెట్టారు. మొత్తంగా ఐఆర్‌డీఏ మీటర్ల కొనుగోలు వ్యవహారంలో భారీగానే మూటగట్టుకున్నట్లు విచారణలో వెల్లడవుతోంది.
సీల్డ్ టెండర్ చింపి...
ఐఆర్‌డీఏ మీటర్లను అనవసరంగా కొన్నారని... వాటితో ప్రస్తుతం వినియోగం లేదని... ఈ మీటర్లు వినియోగంలోకి వచ్చే సమయానికి ఇప్పుడు కొన్నవి పని చేయవంటూ ఎన్పీడీసీఎల్‌కు చెందిన ఓ ైడె రెక్టర్ ప్రభుత్వానికి లేఖ పంపిన విషయం విదితమే. వీటి కొనుగోళ్లతో డిస్కంకు * 41.75 కోట్లు నష్టం తెచ్చారంటూ ఆరోపణలు సంధించారు. దీనిపై చేపట్టిన విచారణలో మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చారుు. కొనుగోలు సమయంలో పలువురు ఉన్నతాధికారులు కలిసి భారీ అవినీతికి తెరలేపారు. మీటర్ల కోసం సీల్డ్ టెండర్లను ఆహ్వానించగా... ప్రస్తుతం సరఫరా చేసిన కంపెనీ అందులో పాల్గొంది. అతి తక్కువ ధరలకు అందరికంటే ముందుగా టెండరు వేసింది. పలు డిస్కంలలో ఉన్న ధర కంటే ఒక్కో మీటరుపై * 54 తక్కువగా కోట్ చేసింది. కానీ... ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు టెండరు దాఖలు ముగిసిన అనంతరం టెండరు దరఖాస్తులను ఓపెన్ చేశారు. ముందస్తు వ్యూహం మేరకు సదరు మీటరు కంపెనీతో బేరసారాలకు దిగారు. మీటరు ధరకంటే అదనంగా ఎంత వేసినా... అధికారులకే ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం తక్కువ ధర వేసిన కంపెనీతో ఒక ధ్రువీకరణ లేఖను రాయించుకున్నారు. మీటర్ల తయారీలో పేరున్న ఆ కంపెనీ నుంచి ‘తప్పు జరిగిందని.. వ్యాట్ మరిచిపోయామని.. మీటర్ల నాణ్యత సరిగా తెలుసుకోకుండా తక్కువ ధరకు వేశామని’ ఓ లేఖను రాయించుకున్నారు. టెండరు దాఖలుకు ముందే నిబంధనల్లో ఇవన్నీ ఉంటాయి. మీటరు నాణ్యత, వ్యాట్, ఖర్చు, మెయింటనెన్స్ తదితర అంశాలన్నీ వాటిలో స్పష్టంగా పేర్కొంటారు. కానీ... ఆ కంపెనీ మాత్రం తాము తెలియకుండా తక్కువ ధర వేశామని, ఆ పాత ధరల ప్రకారం కాకుండా... ఇప్పుడిచ్చే కొత్త ధర ప్రకారం టెండరు అప్పగించాలంటూ లేఖను సమర్పించారు.
అధికారుల ఒప్పందం
మీటర్ల టెండర్లకు తక్కువ ధర వేసినవారిని కాదని... అప్పటికే బేరం కుదుర్చుకున్న కంపెనీకి ఒక్కో మీటరుకు * 835 చొప్పున ఇచ్చేందుకు ఎన్పీడీసీఎల్ అధికారులు టెండరు అప్పగించారు. మిగిలిన డిస్కంలలో మీటర్ల కోసం అసలు ధరకన్నా * 54 తక్కువగా వేసిన ఇదే కంపెనీ... ఎన్పీడీసీఎల్‌లో మాత్రం * 110 అదనంగా ఎందుకు వేసింది... ఇంత అదనంగా వేసిన కంపెనీకి ఎందుకు టెండరు అప్పగించారనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.
వేరే చోట * 725.. ఇక్కడ * 835
ఐఆర్‌డీఏ మీటర్ల కొనుగోళ్లలో అదనపు బిల్లుతోనే అధికారులకు * 5.50 కోట్లు ముట్టినట్లు సంస్థలో ప్రచారం జరుగుతోంది. ఎన్పడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా... ఈపీడీసీఎల్‌కు కూడా సీఎండీగా ఉ న్నారు. ఆ డిస్కంలో ఐఆర్‌డీఏ మీటర్లను * 725 చొప్పున దిగుమతి చేసుకున్నారు. మీటర్ల దిగుమతి కూడా సదరు కంపెనీదే బాధ్యత. కానీ... ఎన్పీడీసీఎల్‌లో మాత్రం ఒక్క మీటరుకు * 835 చెల్లించా రు. ఒక్క దానికి * 110 చొప్పున అంటే ఐదు లక్షల మీటర్లకు * 5.50 కోట్లను అదనంగా చెల్లించారు. వీటితోపాటు మొత్తం సొమ్ములో 8 నుంచి 10 శాతం వాటాను అధికారులకు మీటర్ల కంపెనీ నజరానాగా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది