goalmal
-
‘కియా’ గోల్మాల్
కార్ల కంపెనీకి భూసేకరణలో మాయాజలం రూ. కోట్ల విలువైన 16 ఎకరాలు తప్పించే ఎత్తుగడ మనం చూస్తున్న ఈ భూములు కియా పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న ప్రాంతానికి ఎదురుగా ఉన్నవి. రెండో విడత భూ స్వాధీన ప్రక్రియలో భాగంగా రెవెన్యూ అధికారులు సేకరిస్తున్న భూములకు ఆనుకుని ఉన్న భూములు కూడా ఇవే. అయితే విలువైన ఈ భూములను స్వాధీనం చేసుకోకుండా మినహాయింపు ఇవ్వడం వెనుక అధికారిక కుట్ర సాగుతున్నట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ భూములను స్వాధీన ప్రక్రియ నుంచి తప్పించేందుకు జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులు పావులు కదిపినట్లు చర్చ సాగుతోంది. పెనుకొండ: మండలంలోని అమ్మవారుపల్లిలో సర్వే 179లో హనుమంతరెడ్డికి 3.26 ఎకరాలు, శేషగిరికి 3.26 ఎకరాలు, వెంకటరెడ్డికి 9.50 ఎకరాల పట్టా భూమి ఉంది. కియా కార్ల పరిశ్రమల ఏర్పాటులో భాగంగా చేపట్టిన భూ స్వాధీన ప్రక్రియ నుంచి ఈ 16 ఎకరాలను అధికారులు తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలు కథ ఏమిటంటే.. కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు ప్రాంతంలో ఎకరా భూమి విలువ కనీసం రూ. కోటికి పైగా ఉంది. దీనిని బట్టి సర్వే 179లోని 16 ఎకరాల భూమి విలువ రూ. 16 కోట్ల పై మాటే. ఈ భూములపై కన్నేసిన జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులు ఎకరా రూ. 30 లక్షలతో అగ్రిమెంట్ చేసుకున్నారు. మధ్యవర్తిగా రియల్టర్ రామచంద్రను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వాధీన ప్రక్రియలో ఈ భూములు పోతే ప్రభుత్వం అందజేసే రూ. 10.50 లక్షలతోనే అమ్మకందారులు సరిపెట్టుకోవాలి. లేకపోతే అగ్రిమెంట్ మేరకు రూ. 30 లక్షలు చెల్లించేటట్లు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. భూములను అగ్రిమెంటు చేసుకున్నా.. కియా కార్ల పరిశ్రమ రెండో విడత భూసేకరణ ప్రారంభించక మునుపే ఈ భూములను అగ్రిమెంట్ చేసుకున్నాను. సిమెంటు పరికరాల తయారీ పరిశ్రమ నెలకొల్పేందుకు ఈ భూమిని కొనుగోలు చేశాను. దీని వెనుక ఎవ్వరి హస్తం లేదు... ఎవరికీ సంబంధం లేదు. ఈ 16 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోరాదంటూ కోర్టును ఆశ్రయించాను. - రామచంద్ర, రియల్ ఎస్టేట్‌వ్యాపారి, అమ్మవారుపల్లి, పెనుకొండ మండలం విషయం తెలియదు.. ఆ 16 ఎకరాల భూమి విషయం నాకు తెలియదు. నిబంధనల మేరకు వ్యవహరిస్తాం. ఆ భూములపై విచారణ చేయిస్తాం. పారదర్శకంగా వ్యవహరించడమే మా బాధ్యత. - రామ్మూర్తి, ఆర్డీవో, పెనుకొండ -
కౌన్సెలింగ్ రచ్చరచ్చ!
– అన్యాయం జరిగిందంటూ అడ్డుకున్న అయ్యవార్లు – పలు అంశాల్లో స్పష్టత కోసం రాష్ట్ర అధికారులకు రాసిన అధికారులు – హిందీ పండిట్ల కౌన్సెలింగ్ నేటికి వాయిదా అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా శనివారం జరిగిన ఎస్జీటీల కౌన్సెలింగ్ రచ్చరచ్చగా మారింది. సీనియార్టీ జాబితాపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక సందర్భంలో కౌన్సెలింగ్‌ను జరగకుండా అడ్డుకున్నారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 1–800 వరకు ఎస్జీటీలతో పాటు పండిట్లకు కౌన్సెలింగ్ ఉంటుందని సమాచారం పంపారు. దీంతో శనివారం ఉదయం 6 గంటల నుంచి సైన్స్ సెంటర్‌కు పండిట్లు, ఎస్జీటీలు వచ్చారు. అయితే తుది సీనియార్టీ జాబితా రాష్ట్ర అధికారుల నుంచి బాగా అలస్యమైంది. ఎట్టకేలకు 12.30 గంటల సమయంలో ఎస్జీటీల తుది సీనియార్టీ జాబితా వచ్చింది. దానిపై కొందరు ఉపాధ్యాయులు తీవ్రంగా మండిపడ్డారు. తాత్కాలిక సీనియార్టీ జాబితాలో ఉన్న సీరియల్ నంబర్‌కు తుది జాబితాలోని నంబరుకు చాలా వ్యత్యాసంగా ఉండటంతో అధికారులతో గొడవకు దిగారు. అనుకూలమైన వారికి వివిధ పాయింట్లు యాడ్ చేయడంతో తాము జాబితాలో వెనక్కు వెళ్లామంటూ వాపోయారు. ధర్మవరం మండలం ఉప్పినేసినపల్లి, వసంతపురం ప్రాథమిక పాఠశాలల్లో నాల్గో కేటగిరీ పాయింట్లులో అందరికీ ఒకేరకంగా కాకుండా ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా నమోదయ్యాయంటూ వాపోయారు. ఈ కేటగిరీ అందరికీ వర్తిస్తుందని మరి పాయింట్లలో ఎందుకు తేడాలున్నాయంటూ నిలదీశారు. అలాగే బుక్కపట్నం మండలం బిట్రగుంటపల్లి, యర్లంపల్లి గ్రామాలు నాల్గో కేటగిరీలో ఉన్నాయని, వీటి మధ్య ఉన్న కొత్తకోటను నాల్గో కేటగిరీలో లేకుండా చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ విషయాలపై డీఈఓ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి సర్దిచెప్పారు. ఏవైనా అభ్యంతరాలుంటే రాతపూర్వకంగా ఇవ్వాలి తప్ప కౌన్సెలింగ్‌ను అడ్డుకోరాదని ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేదే లేదని డీఈఓ స్పష్టం చేశారు. బీఈడీ కోర్సుకు వెళ్లినా పాయింట్లు నమోదు ఎస్సీ,ఎస్టీ ఎస్జీ టీచర్లకు ఆన్సర్వీస్లోనే బీఈడీ చేసుకునే అవకాశం ఉంది. రెండేళ్ల పాటు బీఈడీ కోర్సుకెళ్లినా జీతం మంజూరవుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇంతటి బెనిఫిట్‌తో తృప్తి పడని కొందరు ప్రబుద్ధులు బీఈడీ కోర్సు చేసిన కాలంలోనూ విద్యార్థులకు చదువులు చెప్పినట్లు పాయింట్లు వేసేసుకున్నారు. శింగనమల, కూడేరు మండలంలో కొందరు టీచర్లు ఇదేరకంగా పాయింట్లు వేసుకుని కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. తెలుగు పండిట్లకు 3.45 గంటలకు ప్రారంభం మరోవైపు తెలుగు, హిందీ పండిట్ల కౌన్సెలింగ్ మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రారంభమైంది. తుది సీనియార్టీ జాబితా రావడం ఆలస్యమైంది. దీంతో ఉర్దూ, కన్నడ పండిట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. తెలుగుకు సంబంధించి 1–300 వరకు కౌన్సెలింగ్ ఉంటుందని తక్కిన వారికి ఆదివారం ఉంటుందని డీఈఓ ప్రకటించారు. హిందీ పండిట్ల కౌన్సెలింగ్‌ను నేటికి వాయిదా వేశారు. వీరితో పాటు ఎస్జీటీలకూ కౌన్సెంగ్ కొనసాగనుంది. -
ఎంపీ నిమ్మల, ఎమ్మెల్యే పల్లె నిలదీత
ఓడీ చెరువు: మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే పల్లె, ఎంపీ నిమ్మల మధ్య వర్గపోరు మరోమారు బహిర్గతమయింది.. స్థానిక ఐటీఐ కళాశాలలో ఓడీసీ, అమడగూరు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయ కమిటి సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ నిమ్మల కిష్టప్ప హాజరయ్యారు. మొదట ఎమ్మెల్యే జన్మభూమి కమిటి సభ్యుల మార్పు, బూత్ కమిటీల ఏర్పాటు చేసే అంశాలపై మాట్లాడారు. అనంతరం ఎంపీ నిమ్మల కిష్టప్ప టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సం«క్షేమ పథకాలు గురించి మాట్లాడుతున్న సమయంలో కార్యకర్తలు బోరు రమణ తదితరులు తరచూ పార్టీలు మారే వారికే డీలరు షిప్పులు, కాంట్రాక్టులు ఇస్తున్నారని వాపోయారు. పల్లె, నిమ్మల కిష్టప్పకు చెందిన ఇరువర్గాల కార్యకర్తల మధ్య కొంత సేవు వాగ్వాదం చోటు చేసుకుంది. పల్లె సర్ధి చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా ఎంపీ నిమ్మల నవ్వుకుంటూ సమావేశం నుంచి వెళ్లిపోయారు. తర్వాత పల్లె కూడా వెళ్లిపోయారు. దీంతో టీడీపీలో ఎమ్మెల్యే, ఎంపీల మధ్య అంతర్గతంగా నలుగుతున్న కుల, వర్గపోరు సమావేశంలో మరోమారు బహిర్గతమైంది. -
గోల్మాల్!
క్రీడా సామగ్రి కొనుగోలు అక్రమాలు కంపెనీ పేరుమార్చి రూ. లక్షల్లో స్వాహా జిల్లా వ్యాప్తంగా 3,703 ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ.. అమడగూరు: విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని అభివృద్ధి పరిచేందుకు అవసరమైన క్రీడా సామగ్రి కొనుగోలులో భారీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఏడాది విద్యాసంవత్సరం ఆరంభం కాగానే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల 3,703 (2,647 ప్రాథమిక, 587 ప్రాథమికోన్నత, 469 ఉన్నత) ప్రభుత్వ పాఠశాలలకు ఓ ప్రైవేట్ కంపెనీ ద్వారా క్రీడా సామగ్రిని సమకూర్చారు. అయితే ఈ మొత్తం తంతులో సుమారు రూ. కోటి వరకూ అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇండెంట్లో కేటాయించిన కంపెనీ ఉత్పత్తులు కాకుండా మరో కంపెనీ ఉత్పత్తులను సరఫరా చేయడం ద్వారా అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. క్రీడా సామగ్రి పంపిణీ బాధ్యతను తీసుకున్న నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్.. నాణ్యత లేని క్రీడా పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఎనిమిది రకాల క్రీడా సామగ్రి కిట్‌ను ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు వ్యాట్ ధరతో కలిపి రూ 4,968, ప్రాథమిక పాఠశాలకు రూ 5,003 ధరతో పంపిణీ చేస్తున్నారు. అయితే బయటి మార్కెట్లో ఇవే ఎనిమిది రకాల ఆట వస్తువులు తక్కువ ధరకు లభ్యమవుతున్నాయి. బాల్‌బాడ్మింటన్ నెట్లు ఇచ్చారు కానీ బాల్స్, బ్యాట్లు ఇవ్వలేదు. నాణ్యత లేని ఈ పరికరాలను ఆయా పాఠశాలల పీఈటీలు తిరస్కరిస్తుంటే వాటిని బలవంతంగా పాఠశాలలకు ఎమ్మార్సీ సిబ్బంది చేరవేస్తున్నారు. ఎస్ఎస్ఏ పీఓ ఎమన్నారంటే.. పాఠశాలలకు నాసిరకం క్రీడా సామగ్రిని పంపిణీ చేస్తుండటంపై ఎస్ఎస్ఏ పీఓ సుబ్రహ్మణ్యంను వివరణ కోరగా.. తాను నూతనంగా బాధ్యతలు స్వీకరించానని, ఏఎంఓను వివరణ అడగమన్నారు. ఇదే విషయంపై ఏఎంఓ చెన్నకృష్ణారెడ్డిని వివరణ కోరగా.. క్రీడా సామగ్రి పరికరాల ఎంపిక జిల్లా అధికారుల చేతుల్లో లేదని, ఈ పరికరాలన్నీ రాష్ట్ర కార్యాలయం నుంచే వచ్చాయని, అక్కడే టెండర్లు పిలిచి, పంపిణీదారుని ఖరారు చేశారని తెలిపారు. రాష్ట్ర కార్యాలయం నుంచి అందిన క్రీడా సామగ్రిని మాత్రమే తాము పాఠశాలలకు చేరవేస్తున్నామని స్పష్టం చేశారు. కిట్‌లోని క్రీడాపరికరాల వివరాలు, వాటి ధరలు ఇలా క్రీడా పరికరం సంఖ్య పంపిణీ ధర మార్కెట్ ధర టెన్నీకాయిట్ రింగ్స్ 5 రూ.485.70 రూ.260 బాల్ బ్యాడ్మింటన్ నెట్ 1 రూ.271.43 రూ.200 స్కిప్పింగ్ రోప్స్ 9 రూ.437.13 రూ.270 కోన్స్ 6 రూ.408.60 రూ.408 వాలీబాల్ 1 రూ.914.29 రూ.300 వాలీబాల్ నెట్ 1 రూ.695.24 రూ.400 హూప్స్ 5 రూ.542.85 రూ.300 క్యారమ్‌బోర్డ్ 1 రూ.976.19 రూ.580 మొత్తం (వ్యాట్ ధర అదనం) రూ.4,731.43 రూ.2,718 -
మాయ‘రోగం’!
– బదిలీ కోసం అయ్యవార్ల అడ్డదారులు - లేని రోగానికి ధ్రువపత్రాలు - మిస్సెస్‌లు కూడా ‘మిస్’గా దరఖాస్తు – ప్రత్యేక కమిటీతో విచారణ చేయిస్తే వెలుగులోకి అక్రమాలు – బోగస్ పత్రాలపై మెడికల్ బోర్డుకు సిఫార్సు చేస్తామన్న డీఈఓ అయ్యవార్లకు మాయ‘రోగం’ పట్టుకుంది. అన్నీ సవ్యంగా ఉండీ...ఆరోగ్యంగా ఉన్నప్పటికీ తమకు దీర్ఘకాలిక రోగం ఉందంటూ ధ్రువీకరణ పత్రాలు తెస్తున్నారు. మరికొందరు వికలత్వ శాతం భారీగా పెంచి సర్టిఫికెట్లు పుట్టిస్తున్నారు. బదిలీల వేళ కోరుకున్న చోట పోస్టింగ్ దక్కించుకునేందుకు అడ్డదార్లన్నీ తొక్కుతున్నారు. ధ్రువీకరణ పత్రం నకిలీదని తెలిసినా అమ్యామ్యాలతో ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఎంఈఓలు వాటిని ధ్రువీకరిస్తూ దీపం ఉండగానే ఇళ్లు సర్దుకుంటున్నారు. - అనంతపురం ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రిపరెన్షియల్ కేటగిరీ (వివిధ రోగాలతో బాధపడుతున్న వారు, దివ్యాంగులు) వారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది. వీరికి పాయింట్లతో సంబంధం లేకుండా ముందుగా కౌన్సెలింగ్ నిర్వహించి ఉన్న ఖాళీల్లో అనుకూలమైన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. దీన్ని ఆసరాగా చేసుకున్న అయ్యవార్లు మంచి స్థానాలకు వెళ్లేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. లేనిరోగం ఉన్నట్లు...కాస్తాకూస్తో ఉన్న అంగవైక్యల్యం శాతాన్ని 70కి పైగా ఉన్నట్లు బోగస్ ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు. తాము కోరుకున్న స్థానాలకు వెళ్లేందుకు ఇలా ప్రణాళిక రూపొందించారు. అనుకూలమైన స్కూళ్లకు వెళ్లాలని... ఒకసారి బదిలీ జరిగితే టీచర్లు 8 ఏళ్లు, ప్రధానోపాధ్యాయులు 5 ఏళ్లపాటు అదే స్థానంలో ఉండొచ్చు. ఇన్నేళ్లు పని చేయాలంటే అన్ని అనుకూలంగా ఉన్న స్కూళ్లకు వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ఆశే కొందరిని తప్పుదారి పట్టిస్తోంది. మంచి స్థానాలు దక్కించుకునేందుకు అక్రమాలకు తెరతీశారు. కొందరు మెడికల్ బోర్డు ద్వారా తప్పుడు ధ్రువపత్రాలు పొంది తాము దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నామని, మరి కొందరు టీచర్లు తక్కువ శాతం అంగవైకల్యం ఉన్నా... 70 శాతానికి పైగా ఉన్నట్లు ధ్రువపత్రాలు పొందారు. లీలలెన్నో... బుక్కరాయసముద్రం మండలంలో ఓ ఉపాధ్యాయురాలు ఎలాంటి రోగం లేకపోయినా కేన్సర్ ఉన్నట్లు దరఖాస్తులో పేర్కొన్నారు. అలాగే మరికొందరు తల్లిదండ్రులకు బాగలేదంటూ సర్టిఫికెట్లు పెట్టి ప్రిపరెన్షియల్ కేటగిరీకి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే జువైనల్ డయాబెటీస్‌లోనూ ఇదే పరిస్థితి. పిల్లలకు షుగర్ వ్యాధి లేకపోయినా ఉన్నట్లు ఇంకొందరు తప్పుడు ధ్రువీకరణపత్రాలు సమర్పించారు. పిల్లలు థలసేమియా వ్యాధితో బాధపడుతున్నట్లు కూడా కొందరు దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఇక కొందరు మహిళా టీచర్లయితే ఏకంగా పెళ్లయినా పెళ్లికాలేదని దరఖాస్తు చేసినట్లు సమాచారం. చేతులు మారుతున్న డబ్బులు ఇదే అదనుగా కొందరు ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు ‘లెక్క’లు సరి చేసుకుంటున్నారు. ఎవరైనా దొంగ సర్టిఫికెట్లతో పాయింట్లు, ప్రిపరెన్షియల్ కేటగిరీకి దరఖాస్తు చేసుకుంటున్నారో వారి నుంచి బాగా ఆశిస్తున్నారు. ఓ ఎంఈఓ అయితే తన వాటా ఇస్తేనే దరఖాస్తు పంపుతానని, లేకుంటే పంపేది లేదని ఓ మహిళా టీచరు భర్తకు తెగేసి చెప్పినట్లు సమాచారం. దీంతో సదరు టీచరు భర్త బేరం ఆడి చివరకు ఎంఈఓకు కొంత మొత్తం చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. చాలా మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని కొందరు అధికారులు బాగా ఒంటæ పట్టించుకున్నారు. ప్రత్యేక కమిటీతో విచారణ చేయించాలి నకిలీ ధ్రువపత్రాలతో అనర్హులు మంచి స్థానాలు దక్కించుకుంటుంటే... నిజాయతీగా దరఖాస్తు చేసుకున్న టీచర్లకు అన్యాయం జరుగుతోందని పలువురు టీచర్లు వాపోతున్నారు. ప్రిపరెన్షియల్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న టీచర్ల సర్టిఫికెట్లపై ప్రత్యేక కమిటీతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటపడతాయని చెబుతున్నారు. ఇక్కడ పని చేసి ప్రస్తుతం గుంటూరు కలెక్టర్‌గా పని చేస్తున్న కోన శశిధర్ ఆ జిల్లాలో ప్రత్యేక బృందాన్ని నియమించి వెరిఫికేషన్ చేయిస్తున్నారనీ, అదే తరహాలో మన జిల్లాలోనే తనిఖీలు చేయిస్తే దొంగ సర్టిఫికెట్ల బండారం బయట పడుతుందంటున్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం ప్రిపరెన్షియల్ కేటగిరీకి అర్హులైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎవరైనా లేని రోగాలు ఉన్నట్లు చూపినా...అంగవైకల్యం శాతం ఎక్కువ ఉన్నట్లు తప్పుడు ధ్రువీకరణపత్రాలు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటాం. అలాంటి సర్టిఫికెట్లన్నింటినీ మెడికల్ బోర్డుకు పంపి విచారణ చేయిస్తాం. బోగస్ అని తేలితే ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. అలాగే వాటిని ధ్రువీకరించిన హెచ్ఎంలు, ఎంఈఓలపైనే కఠిన చర్యలు తీసుకుంటాం. – లక్ష్మీనారాయణ, డీఈఓ -
గందరగోళంగా బదిలీ ప్రక్రియ!
– రీజనరేట్‌కు నోచుకోని పాయింట్లు – ప్రారంభం కాని సర్టిఫికెట్ల పరిశీలన – ఆందోళనలో ఉపాధ్యాయులు అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రక్రియ గందరగోళంగా మారింది. షెడ్యూలు ప్రకారం 6వ తేదీ నాటికే వివిధ పాయింట్లు రీజనరేట్ కావాల్సి ఉంది. కానీ శుక్రవారం రాత్రి వరకు పాయింట్లు జనరేట్ కాలేదు. అలాగే శుక్రవారం నుంచే సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా... ఇప్పటిదాకా అతీగతీ లేదు. మరోవైపు బదిలీకి దరఖాస్తు చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాయింట్ల విషయంలో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సర్టిఫికెట్ల పరిశీలన 10వ తేదీ ముగుస్తుండడంతో హెచ్ఎంలు, మండల విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తికావడంపై పలువురు ఎంఓఈలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా బదిలీ నిబంధనలను స్వల్పంగా మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. –అప్‌గ్రేడ్ అయిన పీఈటీ, పండిట్లకు వారు పని చేసిన పాత స్కూళ్ల సర్వీస్‌ను పరిగణలోకి తీసుకుని పాయింట్లు జమ చేస్తారు. – 2015లో జరిగిన బదిలీల్లో ఆలస్యంగా రిలీవ్ అయిన వారు బదిలీకి అర్హులు. – అంతర్జిల్లా బదిలీల టీచర్లకు వారి మొత్తం సర్వీస్‌ను పరిగణలోకి తీసుకుని పాయింట్లు లెక్కిస్తారు. – ప్రిపరెన్షియల్ కేటగిరీలో గతంలో 8 సంవత్సరాలు ఉండేది. తాజాగా 8 అకడమిక్ ఇయర్‌గా పరిగణిస్తారు. – ప్రభుత్వ పాఠశాలల్లో సర్‌ప్లస్‌గా ఉన్న స్కూల్ అసిస్టెంట్లను అవసరమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు. -
చంద్రగ్రహణం
ఇన్పుట్ సబ్సిడీలో లోపించిన పారదర్శకత - టీడీపీ నేతల దయాదాక్షిణ్యాలపైనే మంజూరు - అస్మదీయులైతే పొలం లేకున్నా పరిహారం - జిల్లాలో రూ.వంద కోట్లకు పైగా గోల్మాల్ - భాగస్వాములవుతున్న వ్యవసాయాధికారులు - ఇన్సూరెన్స్ మంజూరులోనూ అన్యాయమే.. - ఆత్మకూరు మండలం సిద్ధలాపురానికి చెందిన ఎ.లక్ష్మిదేవికి సర్వే నెంబర్ 497–3ఏలో పొలం ఉన్నట్లు, అందులో ఆముదం సాగు చేసినట్లు.. ఈ పంటకు నష్టం వాటిల్లినట్లు రూ.13,600 ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. నిజానికి ఈమెకు పొలం లేదు. ఇదే సర్వే నెంబర్ 497–3ఏలో అదే గ్రామానికి చెందిన కె.కవిత కూడా ఆముదం సాగు చేసి నష్టపోయినట్లు రికార్డులు సృష్టించారు. ఈమెకు రూ.13,600 పరిహారం మంజూరయింది. ఇంతటితో ఆగలేదు. ఇదే సర్వే నెంబర్(497–3ఏ)లో అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి వెంకటేశులు కూడా ఆముదం సాగు చేసి నష్టపోవడంతో రూ.12,240 పరిహారం ఇచ్చారు. ఈయనకూ పొలం లేకపోవడం గమనార్హం. ఈ మండలంలో ఇలాంటి అనర్హులు వేల సంఖ్యలో ఉన్నారు. అయితే వీరికున్న అర్హత.. మంత్రి పరిటాల సునీత అనుచరులు కావడమే! - బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామంలో లక్ష్మీదేవి అనే మహిళా రైతుకు 3.60 ఎకరాల పొలం ఉంది. ఈమె ఖాతాలో(నెంబర్:1163) రూ.3వేలు మాత్రమే జమ చేశారు. ఇదే గ్రామంలో డి.ఈశ్వరయ్య అనే మరో రైతు 2.74 ఎకరాల్లో(పట్టా నెంబర్.954–డి) పంటసాగు చేసి నష్టపోయారు. ఈయనకు రూ.6వేల ఇన్పుట్ సబ్సిడీ జమ చేశారు. ఇదే గ్రామానికి చెందిన మరో రైతు సూర్యనారాయణ 2.50 ఎకరాల్లో(పట్టా నెంబర్.955) పంటసాగు చేసి నష్టపోయారు. ఈయనకు రూ.3వేలు జమ అయ్యింది. ఎకరాకు రూ.6వేలు చొప్పున పరిహారం అందాల్సి ఉన్నా.. అలా జరక్కపోవడానికి వీరంతా అధికార టీడీపీ నేతలతో సన్నిహితంగా మెలగకపోవడమేనని తెలుస్తోంది. - ఇదీ జిల్లాలో ఇన్పుట్ సబ్సిడీ తీరుతెన్ను. ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ పూర్తిగా అధికార పార్టీ నేతల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జరుగుతోంది. ఇది ప్రభుత్వ సొమ్ము. నష్టపోయిన రైతులందరికీ దక్కాల్సిన పరిహారం అనే విషయాన్ని విస్మరించి అధికారులు కూడా అధికార పార్టీ నేతలకు జీహుజూర్ అంటున్నారు. పొలం లేని వారికి సర్వే నెంబర్లు, ఖాతాలు సృష్టించి పరిహారం పంచుతున్నారు. పొలం ఉండి, పంటసాగు చేసి నష్టపోయిన వారితో చెలగాటం ఆడుతున్నారు. సాక్షిప్రతినిధి, అనంతపురం : గత ఏడాది ఖరీఫ్‌లో రైతులు 8.50లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఈ విస్తీర్ణానికి బ్యాంకర్లు పంట రుణం కూడా అందించారు. అధికారులు మాత్రం 7.17లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు లెక్కలు తేల్చారు. ఇందులో 5.90లక్షల హెక్టార్లు వేరుశనగ, తక్కిన విస్తీర్ణంలో ఇతర పంటలు నష్టపోయినట్లు లెక్కగట్టారు. బ్యాంకర్లు వేరుశనగకు ఎకరాకు పెట్టుబడి రూ.19,500 అవుతుందని లెక్కగట్టి ఆ మేరకు రుణం మంజూరు చేశారు. ఈ లెక్కన జిల్లాలో సాగైన 6.02లక్షల హెక్టార్ల వేరుశనగకు రూ.2,954 కోట్ల నష్టం వాటిల్లింది. ఇతర పంటలకు మరో రూ.500కోట్ల మేర నష్టం సంభవించింది. ప్రభుత్వం 63 కరువు మండలాలను ప్రకటించింది. కానీ ఇన్పుట్ సబ్సిడీ మాత్రం రూ.1032.42కోట్లు మాత్రమే మంజూరు చేసింది. అంటే.. రైతులకు ఎకరాకు 19,500 ఖర్చయితే, ప్రభుత్వం రూ.6వేలు మాత్రమే లెక్కగట్టింది. ఇది ప్రభుత్వం రైతులకు చేసిన మొదటి అన్యాయం. పోనీ ఆ మేరకైనా పరిహారం ఇస్తున్నారా? అంటే అదీ లేదు. ఆధార్ ‘లింకు’ పేరుతో మరో అన్యాయం ప్రతి రైతుకు 5ఎకరాల వరకూ పరిహారం ఇవ్వాలి. ఈ లెక్కన అత్యధికంగా రూ.30వేల వరకూ రైతులకు పరిహారం దక్కాలి. ఒక రైతుకు ఓ గ్రామంలో 2 ఎకరాల పొలం ఉండి, మరో గ్రామంలో మరో రెండు ఎకరాల పొలం ఉంటే నాలుగెకరాలకు పరిహారం అందాలి. కానీ ఒకే ఆధార్‌కార్డుతో రెండుచోట్ల పొలం ఉందనే కారణంతో పరిహారం ఎగవేస్తున్నారు. దీంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. టీడీపీ నేతలకైతే పొలం లేకున్నా సర్వే నెంబర్లు, ఖాతాలు సృష్టించి పరిహారం వేస్తున్నారు. ఇందులో వ్యవసాయాధికారులు పూర్తిగా అధికార పార్టీ చెప్పుచేతల్లో నడుచుకుంటూ ఇన్పుట్ సబ్సిడీ మంజూరులో గోల్మాల్ చేస్తున్నారు. నిజమైన రైతులుంటే వారికి హక్కుగా దక్కాల్సిన పరిహారాన్ని కూడా అందించని పరిస్థితి. ఇలా.. రూ.వంద కోట్లకు పైగా జిల్లాలో గోల్మాల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే.. టీడీపీ నేతలు మాత్రం రైతు కృతజ్ఞత యాత్ర పేరుతో చంద్రబాబును జిల్లాకు రప్పిస్తున్నారు. కృతజ్ఞత చెప్పాలనే ఆలోచన ‘అనంత’ రైతులెవ్వరికీ లేకపోయినా అధికార పార్టీనేతలు, కార్యకర్తలు పంటసాగు చేయకపోయినా కాసుల పంట పండుతుండటంతో వారు చంద్రబాబుకు కృతజ్ఞత తెలియజేసేందుకు బాబును పిలిపించుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. బీమా మంజూరులో తిరకాసు 21.25లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేసేందుకు రైతులు రుణాలు తీసుకున్నట్లు బ్యాంకు రికార్డులు చెబుతున్నాయి. ఈ విస్తీర్ణానికి రైతుల నుంచి ప్రీమియం వసూలు చేశారు. కానీ 15.05లక్షల ఎకరాల్లోనే పంట సాగయిందని వ్యవసాయాధికారులు క్రాప్‌బుకింగ్ రికార్డుల్లో పేర్కొన్నారు. ఇందులో 14.87లక్షల ఎకరాలకు నష్టం వాటిల్లిందని బీమా కంపెనీ తేల్చింది. ఈ మొత్తానికి పరిహారం చెల్లించేందుకు బజాజ్ కంపెనీ జిల్లాకు రూ.419కోట్ల పరిహారాన్ని చెల్లిస్తోంది. నిజానికి రైతు తీసుకున్న రుణానికి ఇన్సురెన్స్ చేశారు. అంటే ఏ మేరకు రుణం తీసుకున్నారో, ఆ మేరకు బీమా మంజూరు కావాలి. ఈ లెక్క రూ.2,500కోట్లకు పైనే అవుతుంది. కానీ బీమా కంపెనీ కేవలం రూ.419కోట్లు మాత్రమే ఇస్తోంది. ఈ మొత్తాన్ని 14.87లక్షల ఎకరాలకు జమ చేస్తున్నారు. తక్కిన 6.37లక్షల ఎకరాలకు పరిహారం ఎవరు చెల్లించాలనేది ప్రశ్నార్థకం. -
‘డ్వామా’లో మెగా డ్రామా
- ఉపాధి సిబ్బందికి ప్రభుత్వ ప్రోత్సాహకం - జిల్లాకు సుమారు రూ.74 లక్షలు విడుదల - ఖాతాల్లోకి వేయడంలో అధికారుల నిర్లక్ష్యం - ‘మెగా చెక్’ పేరుతో ప్రచార ఆర్భాటానికి ఏర్పాట్లు - బాబు, చినబాబుతోనే ఇప్పించాలని ప్లాన్ సంక్షేమ పథకాలను నిరుపేదల దరికి చేర్చడంలో విఫలమవుతున్న ప్రభుత్వం... ఆ అప్రతిష్టను తొలగించుకునేందుకు నానా పాట్లు పడుతోంది. అందువల్లే అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ ప్రచారం చేసుకునే పనిలో నిమగ్నమైంది. అందులో భాగంగానే ‘డ్వామా’లో మెగా డ్రామా ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉపాధిహామీ సిబ్బందికి మంజూరైన ప్రభుత్వ ప్రోత్సాహక మొత్తాన్ని పంపిణీ చేసేందుకు ‘మెగా’ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. - అనంతపురం టౌన్ కరువు జిల్లాలో వలసలు నివారించేందుకు చేపట్టిన ‘ఉపాధి’ హామీ పథకం కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల అబాసుపాలవుతోంది. ఈ క్రమంలోనే దిద్దుబాటు చర్యలకు దిగిన గ్రామీణాభివృద్ధి శాఖ బాగా పని చేస్తున్న ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇచ్చి పని దినాలు పెంచేలా ప్రణాళిక సిద్ధ౾ చేసింది. అందులో భాగంగా ఉపాధిహామీ పథకం సిబ్బంది గ్రామాల్లో ఎన్ని కుటుంబాలకు, ఎన్ని వంద రోజులు పని కల్పిస్తే అన్ని వందల రూపాయలు మంజూరు చేసింది. జిల్లాకు రూ.74 లక్షలు జిల్లాలో 2016–17 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకంలో 73,971 కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 73,971 కుటుంబాలకు వంద రోజులు కల్పించినందుకు రూ.100 చొప్పున రూ.73,97,100 మంజూరు చేసింది. వంద రోజులు పనిదినాలు కల్పించడంలో భాగస్వాములైన మేట్లు /జూనియర్ మేట్లు /సీనియర్ మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.30 చొప్పున, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.15 చొప్పున, ఈసీకి రూ.10, ఏపీఓలకు రూ.10, కంప్యూటర్ ఆపరేటర్‌కు రూ.5 చొప్పున పారితోషకం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కలను బట్టి చూస్తే ఏపీఓ, జేఈ, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.వేలల్లో పారితోషకాలు అందుతాయి. వీలైతే బాబు..లేదంటే చినబాబు జిల్లాకు మంజూరు చేసిన ప్రోత్సాహక మొత్తాన్ని 15 రోజుల్లోపు సిబ్బందికి అందజేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండు నెలలైనా నేటికీ ఖాతాల్లోకి డబ్బులు పడలేదు. అసలు విషయం ఏంటని ఆరా తీస్తే.. విడుదలైన మొత్తాన్ని నేరుగా ఉద్యోగుల ఖాతాల్లోకి వేస్తే ప్రభుత్వానికి ఎలాంటి క్రెడిట్ రాదు. అదే ప్రత్యేక కార్యక్రమం చేపడితే కొద్దోగొప్పో ప్రచారం దక్కుతుంది. ఈ మేరకు డ్వామా అధికారులు కూడా సన్నాహాలు చేస్తున్నారు. వీలైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కాకుంటే గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ‘మెగా’ చెక్ ఇప్పించాలని భావిస్తున్నారు. పనిలో పనిగా ‘థ్యాంక్యూ సీఎం’ కార్యక్రమం కూడా చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే చంద్రబాబు కన్నా చినబాబు చేతుల మీదుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే రాజకీయంగా ఆయనకు కాస్త మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుందని, ఆ దిశగానే జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. మరోవైపు నిధులు విడుదలైనా మంజూరులో జాప్యంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. -
అక్రమాలకు ‘అండ’
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లలో భారీ గోల్మాల్ జరుగుతోంది. నాసిరకంగా ఉన్నవి.. గోలీ కాయల్లాంటి గుడ్లు సరఫరా చేస్తూ కాంట్రాక్టర్లు చేతివాటం చూపుతుండగా ఐసీడీఎస్ అధికారులు ‘మామూళ్ల’ మత్తులో జోగుతున్నారు. గుడ్ల సరఫరాలో ఎక్కడా ప్రమాణాలు పాటించకపోవడంతో అవినీతి తారస్థాయికి చేరుతోంది. - అనంతపురం టౌన్ తల్లీబిడ్డ సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషక విలువలతో కూడిన ఆహారం సరఫరా చేస్తోంది. పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన తల్లులు రక్తహీనతతో తల్లడిల్లుతుండడం..తక్కువ బరువున్న శిశువులకు జన్మనిస్తుండడంతో వారికి కోడిగుడ్లు అందించాలని నిర్ణయించాయి. లక్ష్యం ఉదాత్తమైనదే అయినా ఆచరణలో మాత్రం చతికిలపడుతోంది. క్షేత్రస్థాయిలో భారీ ఎత్తున అక్రమాల భాగోతం జరుగుతోంది. జిల్లా యంత్రాంగం దృష్టి కేంద్రీకరించకపోవడంతో స్వార్థపరులు రెచ్చిపోతున్నారు. గోలీకాయలను తలపించేవి..మురిగిపోయినవి సరఫరా చేస్తూ గుడ్ల మాటున గుటకాయ స్వాహా చేస్తున్నారు. జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) కింద 17 ప్రాజెక్టులుండగా 4,286 మెయిన్, 840 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 1,49,339 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 96505 మంది ఉన్నారు. 35943 మంది గర్భిణులు , 36192 మంది బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. జిల్లాలోని గుత్తి, హిందూపురం, కదిరి (ఈస్ట్), కదిరి (వెస్ట్), కళ్యాణదుర్గం, కంబదూరు, కణేకల్లు, మడకశిర, పెనుకొండ, రాయదుర్గం ప్రాజెక్టుల్లో ‘అన్న అమృతహస్తం’ అమలు చేస్తున్నారు. మిగిలిన అనంతపురం, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, కూడేరు, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండ ప్రాజెక్టుల్లో పౌష్టికాహారం అందిస్తున్నారు. గుడ్ల సరఫరాలో గోల్మాల్ అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లలో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. అన్న అమృత హస్తం అమలయ్యే ప్రాజెక్టుల్లో గర్భిణులు, బాలింతలకు వారానికి ఆరు, మూడేళ్లలోపు చిన్నారులకు రెండు, 3–6 ఏళ్లలోపు పిల్లలకు (కేంద్రంలోనే వండాలి) నాలుగు చొప్పున కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు వారానికి నాలుగు, మూడేళ్లలోపు పిల్లలకు రెండు, 3–6 చిన్నారులకు నాలుగు (కేంద్రంలోనే వండిపెట్టాలి) అందిస్తున్నారు. అన్ని ప్రాజెక్టుల పరిధిలోని కిశోర బాలికలకు వారానికి నాలుగు ఇవ్వాల్సి ఉంటుంది. నెలలో మొదటి 15 రోజుల్లో ఒకసారి, ఆ తర్వాత మరోసారి చొప్పున నెలకు రెండు సార్లు తప్పనిసరిగా గుడ్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. ప్రాజెక్టుల్లోని అధికారులు అందినకాడికి దోచుకుంటున్నారు. కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారు. నాణ్యతను పరిశీలించకుండా బాధ్యతల్ని విస్మరించి దోచుకోవడమే పరమావధిగా పని చేస్తున్నారు. ఫలితంగా పథకం ఆశయం నీరుగారుతుండగా లబ్ధిదారులను పౌష్టికాహార లోపం వెంటాడుతోంది. కుళ్లినవి వచ్చే ప్రసక్తి లేదు అంగన్వాడీ సెంటర్లకు కుళ్లిన గుడ్లు వచ్చే ప్రసక్తి లేదు. ఒక వేళ వస్తే వాటిని సరఫరా చేసిన వారికే తిరిగిచ్చేయాలి. చిన్న గుడ్లు కూడా సరఫరా చేయడానికి వీల్లేదు. ఒక్కో గుడ్డు 45 నుంచి 50 గ్రాములుండాలి. - జుబేదాబేగం, ఐసీడీఎస్ పీడీ -
పోస్టాఫీసులో డిపాజిట్ల గోల్‌మాల్‌పై ఆందోళన
కళ్యాణదుర్గం రూరల్ : మండల పరిధిలోని బోరంపల్లి పోస్టాఫీసులో డిపాజిట్ల గోల్‌మాల్‌పై ఖాతాదారులు మంగళవారం ఆందోళనకు దిగారు. తాము డిపాజిట్ చేసిన డబ్బు ఏమైందో తెలపాలంటూ స్థానిక పోస్టాఫీసు వద్ద పోస్ట్‌మాస్టర్ (గ్రేడ్1)జగదీశ్వరతో ఖాతాదారులు లక్ష్మిదేవి, ఈరక్క, కె.లక్ష్మి, శకుంతలమ్మ, రత్నమ్మ, వంకా సరస్వతి వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కొంత మేరకు పోస్టాఫీసును నమ్మి నగదు డిపాజిట్ చేస్తే బీపీఎం రామ్మూర్తి అడ్రస్సు లేకుండా పోయాడన్నారు. గ్రామంలో 60 మంది దాకా ఒక్కొక్కరు రూ.10వేలు చొప్పున రూ.6లక్షల వరకు డిపాజిట్లు చేశామన్నారు. బీపీఎం రాక పోవడంతో వివరాలు ఆరా తీస్తే పోస్టాఫీసులో డిపాజిట్లు కట్టకుండా కట్టినట్లు తమకు పోస్టాఫీసు సీలు మాత్రం వేసి నగదు వాడుకున్నారన్నారు. తమ డిపాజిట్లు ఎక్కడ అని నిలదీస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడని మండిపడ్డారు. ఇందులో పోస్టాఫీసు అధికారులు వత్తాసు పలకడంతో బీపీఎం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. తాము కూలీ నాలీ చేసి దాచుకున్న సొమ్ము డిపాజిట్ రూపంలో పోస్టాఫీసుకు చెల్లిస్తే ఇలా మోసం చేయడం అన్యాయమన్నారు. గోల్మాల్ చేసిన సొమ్ము చెల్లించకుంటే తీవ్ర ఆందోళన వ్యక్తం హెచ్చరించారు. ఇందుకు పోస్ట్‌మాస్టర్ జగదీశ్వర స్పందిస్తూ రామ్మూర్తి సెలవులో ఉన్నాడని, విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు. మూడు నెలలు ఓపిక పట్టాలని ఆందోళనకారులకు సర్ధిచెప్పడంతో వారు వెనుదిరిగారు. కార్యక్రమంలో ఖాతాదారులు వన్నూర్‌బీ, ఆనం అంజినమ్మ, వంకామీనక్షమ్మ, నాగలక్ష్మితో పాటు చాలా మంది ఖాతాదారులు ఉన్నారు. -
ఇష్టారాజ్యం..!
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపులో కిరికిరి -------------------------------------------------------- అనంతపురం న్యూసిటీ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపు వ్యవహారం వివాదస్పదమవుతోంది. కొన్ని డివిజన్లకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం, మరికొన్నింటిని విస్మరించడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది ఎక్కువ నిధులు కేటాయించిన డివిజన్లకే ఈసారి కూడా అవకాశం కల్పించడం దుమారం రేపుతోంది. మూడు డివిజన్లకు రూ.88.40 లక్షలు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులకు సంబంధించి 32, 33, 34 డివిజన్లకు రూ.88.40 లక్షలు కేటాయించడం గమనార్హం. అవే డివిజన్లకు గత ఏడాది రూ.70 లక్షలు కేటాయించారు. దీంతో అప్పట్లోనే డిప్యూటీ మేయర్ గంపన్నపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తర్వాత వచ్చే నిధుల్లో ఇతర డివిజన్లకు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తామని అప్పట్లో ఆయన ప్రకటించారు కూడా. ఇప్పుడేమో రూ.4.6 కోట్లకు టెండర్లు పిలిస్తే అందులోనూ పైన పేర్కొన్న మూడు డివిజన్లకే మరోసారి పెద్దపీట వేయడం చర్చనీయాంశమైంది. జనాభా ప్రాతిపదికన 21వ డివిజన్లో 2.65 శాతం, 43వ డివిజన్లో 2.65, 48వ డివిజన్లో 1.45 శాతం ఎస్సీలున్నారు. ఈ డివిజన్లకు చిల్లిగవ్వ పెట్టలేదు. తక్కువ జనాభా(0.62 శాతం) ఉన్న 26వ డివిజన్‌కు రూ.9 లక్షలు కేటాయించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఎల్-1ను కాదని... టెండర్లలో కొందరు ఎక్కువ పనులకు టెండర్లు వేశారు. దీనిపై కమిషనర్ సురేంద్రబాబు ఈఈగా ఒకేసారి ఇంత మందికి టెండర్లు ఇవ్వడం సరికాదని, మిగితా వారికి ప్రాధాన్యం కల్పించాలని లేఖ రాసినట్లు తెలిసింది. దీనిపై ఎస్ఈ సత్యనారాయణ అభ్యంతరం చెప్పారని సమాచారం. ఈ ప్రొక్యూర్మెంట్ నిబంధన మేరకు ఎల్-1లకే ప్రాధాన్యం కల్పించాలని, లేకపోతే భవిష్యత్తులో ఆడిట్, విజిలెన్స్ విచారణలు, అభ్యంతరాలు ఎదుర్కోకతప్పదని ఎస్ఈ హెచ్చరించినట్లుకూడడా తెలుస్తోంది. ఇందులో రూ.10 లక్షలపైన ఎక్కువ టెండర్లు ఉండడంతో వీటిని స్టాండింగ్ కమిటీ/కౌన్సిల్ ముందు ఉంచనున్నారు. మరి వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. కమిషనర్ సురేంద్రబాబు ఏమంటున్నారంటే... సబ్‌ప్లాన్ నిధులు గడువులోగా పూర్తి చేయాలి. చాలా మంది వివిధ ప్రాంతాలకు టెండర్లు కోడ్ చేశారు. పనులు వేగవంతం చేయాలని, ఇది వరకే పనులు చేస్తున్నారనే యోచనతో మిగితా వారిని పరిశీలించాలని ఈఈగా ఎస్ఈకు లేఖ రాశా. -
ఐఆర్డీఏ మీటర్ల గోల్మాల్ 6 కోట్లు హాంఫట్!
అది చాలదన్నట్లు అధిక డబ్బులు చెల్లించారు. టెండరు వేసిన కంపెనీతో ముందస్తుగానే బేరం కుదుర్చుకున్న పలువురు అధికారులు కోట్ల రూపాయలు దండుకున్నారు. ఎన్పీడీసీఎల్లో ఐఆర్డీఏ మీటర్ల కొనుగోలుకు సంబంధించిన మరో అవినీతి బాగోతం ఇది. - న్యూస్‌లైన్, వరంగల్ వరంగల్, న్యూస్‌లైన్ : అనవసరంగా కొన్న ఇన్ఫ్రారెడ్ డేటా అసోసియేషన్ (ఐఆర్డీఏ) మీటర్ల బాగోతంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందుగా టెండర్ల సమయంలోనే ఉన్నతస్థాయిలో పలువురు అధికారులు ఏకమై గోల్‌మాల్‌కు పాల్పడ్డారు. మీటర్లకు టెండరు వేసిన కంపెనీతో కలిసి * కోట్లు పంచుకున్నారు. సీల్డ్ టెండర్లను చింపి... తక్కువ ధర వేసిన కంపెనీతో బేరం కుదుర్చుకున్న అధికారులు వ్యూహాత్మకంగా అదే కంపెనీతో లాలూచీ పడ్డారు. అప్పటి సీఎండీతో సహా... పర్చేజింగ్ అధికారులంతా ఈ బాగోతంలో భాగస్వాములుగా ని లిచారు. ఒక్కో మీటరుకు * 110 చొప్పున అదనం గా చెల్లింపులు చేశారు. పక్క డిస్కంలో తక్కువ ధర కు కొనుగోలు చేసిన మీటరుకు ఈ డిస్కంలో మా త్రం ఎక్కువగా ఖర్చు పెట్టారు. మొత్తంగా ఐఆర్డీఏ మీటర్ల కొనుగోలు వ్యవహారంలో భారీగానే మూటగట్టుకున్నట్లు విచారణలో వెల్లడవుతోంది. సీల్డ్ టెండర్ చింపి... ఐఆర్డీఏ మీటర్లను అనవసరంగా కొన్నారని... వాటితో ప్రస్తుతం వినియోగం లేదని... ఈ మీటర్లు వినియోగంలోకి వచ్చే సమయానికి ఇప్పుడు కొన్నవి పని చేయవంటూ ఎన్పీడీసీఎల్కు చెందిన ఓ ైడె రెక్టర్ ప్రభుత్వానికి లేఖ పంపిన విషయం విదితమే. వీటి కొనుగోళ్లతో డిస్కంకు * 41.75 కోట్లు నష్టం తెచ్చారంటూ ఆరోపణలు సంధించారు. దీనిపై చేపట్టిన విచారణలో మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చారుు. కొనుగోలు సమయంలో పలువురు ఉన్నతాధికారులు కలిసి భారీ అవినీతికి తెరలేపారు. మీటర్ల కోసం సీల్డ్ టెండర్లను ఆహ్వానించగా... ప్రస్తుతం సరఫరా చేసిన కంపెనీ అందులో పాల్గొంది. అతి తక్కువ ధరలకు అందరికంటే ముందుగా టెండరు వేసింది. పలు డిస్కంలలో ఉన్న ధర కంటే ఒక్కో మీటరుపై * 54 తక్కువగా కోట్ చేసింది. కానీ... ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు టెండరు దాఖలు ముగిసిన అనంతరం టెండరు దరఖాస్తులను ఓపెన్ చేశారు. ముందస్తు వ్యూహం మేరకు సదరు మీటరు కంపెనీతో బేరసారాలకు దిగారు. మీటరు ధరకంటే అదనంగా ఎంత వేసినా... అధికారులకే ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం తక్కువ ధర వేసిన కంపెనీతో ఒక ధ్రువీకరణ లేఖను రాయించుకున్నారు. మీటర్ల తయారీలో పేరున్న ఆ కంపెనీ నుంచి ‘తప్పు జరిగిందని.. వ్యాట్ మరిచిపోయామని.. మీటర్ల నాణ్యత సరిగా తెలుసుకోకుండా తక్కువ ధరకు వేశామని’ ఓ లేఖను రాయించుకున్నారు. టెండరు దాఖలుకు ముందే నిబంధనల్లో ఇవన్నీ ఉంటాయి. మీటరు నాణ్యత, వ్యాట్, ఖర్చు, మెయింటనెన్స్ తదితర అంశాలన్నీ వాటిలో స్పష్టంగా పేర్కొంటారు. కానీ... ఆ కంపెనీ మాత్రం తాము తెలియకుండా తక్కువ ధర వేశామని, ఆ పాత ధరల ప్రకారం కాకుండా... ఇప్పుడిచ్చే కొత్త ధర ప్రకారం టెండరు అప్పగించాలంటూ లేఖను సమర్పించారు. అధికారుల ఒప్పందం మీటర్ల టెండర్లకు తక్కువ ధర వేసినవారిని కాదని... అప్పటికే బేరం కుదుర్చుకున్న కంపెనీకి ఒక్కో మీటరుకు * 835 చొప్పున ఇచ్చేందుకు ఎన్పీడీసీఎల్ అధికారులు టెండరు అప్పగించారు. మిగిలిన డిస్కంలలో మీటర్ల కోసం అసలు ధరకన్నా * 54 తక్కువగా వేసిన ఇదే కంపెనీ... ఎన్పీడీసీఎల్లో మాత్రం * 110 అదనంగా ఎందుకు వేసింది... ఇంత అదనంగా వేసిన కంపెనీకి ఎందుకు టెండరు అప్పగించారనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. వేరే చోట * 725.. ఇక్కడ * 835 ఐఆర్డీఏ మీటర్ల కొనుగోళ్లలో అదనపు బిల్లుతోనే అధికారులకు * 5.50 కోట్లు ముట్టినట్లు సంస్థలో ప్రచారం జరుగుతోంది. ఎన్పడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా... ఈపీడీసీఎల్‌కు కూడా సీఎండీగా ఉ న్నారు. ఆ డిస్కంలో ఐఆర్డీఏ మీటర్లను * 725 చొప్పున దిగుమతి చేసుకున్నారు. మీటర్ల దిగుమతి కూడా సదరు కంపెనీదే బాధ్యత. కానీ... ఎన్పీడీసీఎల్లో మాత్రం ఒక్క మీటరుకు * 835 చెల్లించా రు. ఒక్క దానికి * 110 చొప్పున అంటే ఐదు లక్షల మీటర్లకు * 5.50 కోట్లను అదనంగా చెల్లించారు. వీటితోపాటు మొత్తం సొమ్ములో 8 నుంచి 10 శాతం వాటాను అధికారులకు మీటర్ల కంపెనీ నజరానాగా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది