ఓడీ చెరువు: మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే పల్లె, ఎంపీ నిమ్మల మధ్య వర్గపోరు మరోమారు బహిర్గతమయింది.. స్థానిక ఐటీఐ కళాశాలలో ఓడీసీ, అమడగూరు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయ కమిటి సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ నిమ్మల కిష్టప్ప హాజరయ్యారు. మొదట ఎమ్మెల్యే జన్మభూమి కమిటి సభ్యుల మార్పు, బూత్ కమిటీల ఏర్పాటు చేసే అంశాలపై మాట్లాడారు.
అనంతరం ఎంపీ నిమ్మల కిష్టప్ప టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సం«క్షేమ పథకాలు గురించి మాట్లాడుతున్న సమయంలో కార్యకర్తలు బోరు రమణ తదితరులు తరచూ పార్టీలు మారే వారికే డీలరు షిప్పులు, కాంట్రాక్టులు ఇస్తున్నారని వాపోయారు. పల్లె, నిమ్మల కిష్టప్పకు చెందిన ఇరువర్గాల కార్యకర్తల మధ్య కొంత సేవు వాగ్వాదం చోటు చేసుకుంది. పల్లె సర్ధి చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా ఎంపీ నిమ్మల నవ్వుకుంటూ సమావేశం నుంచి వెళ్లిపోయారు. తర్వాత పల్లె కూడా వెళ్లిపోయారు. దీంతో టీడీపీలో ఎమ్మెల్యే, ఎంపీల మధ్య అంతర్గతంగా నలుగుతున్న కుల, వర్గపోరు సమావేశంలో మరోమారు బహిర్గతమైంది.
ఎంపీ నిమ్మల, ఎమ్మెల్యే పల్లె నిలదీత
Published Sun, Jul 23 2017 7:55 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement