మద్దిపాడు : ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ముళ్లపల్లి ఏపీఐఐసీ గ్రోత్‌సెంటర్ వద్ద రెండు లారీల (600 బ్యాగులు) ప్రజా పంపిణీ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. బియ్యాన్ని ప్రియాంక రా బాయిల్డ్ రైస్ మిల్లుకు తరలిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. కాగా స్వాధీనం చేసుకున్న రెండు లారీల బియ్యాన్ని సహాయ పౌరసరఫరాల అధికారి ఖాదర్ మస్తాన్‌కు అప్పగించారు.