విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం బైలకించంగిలో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 700 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వాహానాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసి... పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.