విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా అరకులో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 18 వేల నగదుతోపాటు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి 440 కేజీలు ఉంటుందని చెప్పారు. దీని విలువ రూ. కోటి ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.