గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల నీలి కిరోసిన్‌ను పట్టుకున్నారు.
గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల నీలి కిరోసిన్‌ను పట్టుకున్నారు. గుంటూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి ఆటో నగర్‌లో నీలి కిరోసిన్ విక్రయిస్తుంటాడు. అతడి దుకాణంపై గురువారం మధ్యాహ్నం పోలీసులు దాడి చేసి 700 లీటర్ల నీలి కిరోసిన్‌ను పట్టుకున్నారు. పోలీసుల రాకను గమనించిన నాగరాజు తన సెల్‌ఫోన్‌ను అక్కడే వదిలేసి పరారయ్యాడు. సెల్‌ఫోన్ సహా కిరోసిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.