గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద గుర్తుతెలియని దుండగులు రౌడీ షీటర్‌ను హత్య చేశారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పాతూరు వద్ద గుర్తుతెలియని దుండగులు రౌడీ షీటర్‌ను హత్య చేశారు. కొల్లూరు గ్రామానికి చెందిన నాగరాజు అనే రౌడీ షీటర్‌ను హతమార్చి గోనె సంచిలో వేసి కృష్ణానదిలో పడేశారు. నదీ తీరంలో గోనెసంచిని గమనించిన స్థానికులు మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి గోనెసంచి విప్పగా అందులో మృతదేహం కనిపించింది. మృతదేహం కొల్లూరుకు చెందిన నాగరాజు అనే రౌడీ షీటర్‌దిగా గుర్తించారు. దుండలుగు హత్యచేసి గోనెసంచిలో కుక్కి నదిలో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.