
7 నుంచి అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ మంగళవారం నోటిఫికేషన్ జారీచేశారు. శాసనమండలి సమావేశాలు కూడా అదే రోజు ప్రారంభమవుతాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ఆరోజు ఉదయం 8.55 గంటలకు ప్రసంగిస్తారు.
రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి 12వ తేదీన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను 13వ తేదీన వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమర్పించనున్నారు. ఈ సమావేశాలు మార్చి 27వ తేదీవరకు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.