8 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత | 8 lakhs worth Redwood seized in Nellore forest | Sakshi
Sakshi News home page

8 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత

Published Tue, Dec 24 2013 10:19 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM

8 lakhs worth Redwood seized in Nellore forest

నెల్లూరు: ఎర్రచందనం అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతోంది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు యత్నించిన అటవీశాఖ అధికారులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని రాపూర్ మండలం గోలుపల్లి అడువుల్లో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తోన్న వాహనాన్ని మంగళవారం అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.

 

ఆ వాహనంలో తరలిస్తున్న 8లక్షల రూపాయల విలువైన 40ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. టాటా ఏస్ వాహనాన్నిసీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement