భీమ్‌గల్, న్యూస్‌లైన్: శుక్రవారం రాత్రి కిరోసిన్ పోసుకుని నిప్పం టించుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డ భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ గ్రామానికి చెంది న కూన మాధవి (20) మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లయి ఏడాది కూడా గడవకముందే ఆమె బల వన్మరణానికి పాల్పడడానికి బలపైన కారణాలు ఎంటన్నదానిపైనే గ జరుగుతోంది. మండలంలోని బాబాపూర్ గ్రామానికి చెందిన మోహన్, పద్మ దంపతుల ఏకైక కుమార్తె మాధవిని గతేడాది డిసెంబర్‌లో బడాభీమ్‌గల్‌కు చెందిన మేనళ్లుడైన కూన శ్రీనివాస్‌కు ఇచ్చి వివాహం జరిపించారు.
అయితే ఈ వివాహం శ్రీని వాస్‌కు ఇష్టం లేదని తెలుస్తుంది. పెద్దల ఒత్తిడి మేరకు వివాహం చేసుకున్న ఆయన తన భార్యను తరచూ వేధించేవాడని మృతురాలి బంధువులు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడు శ్రీనివాస్ ఏపని లేక జులాయిగా తిరిగేవాడని, తరుచూ భార్యతో గొడవ పడేవాడని స్థానికుల మాటలను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో మాధవి ఇంట్లో గదిలో గడియ పెట్టుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుని ఆత్మహత్యకు ఒడిగట్టింది. మృతురాలు నాలుగు నెలల గర్భిణి అని తెలిసింది. పెళ్లయి ఏడాదైన గడవకముందే నిండు నూరేళ్ల జీవితం ముగియడంపై బంధువులు, కుటంబీకులు కంట తడి పెడుతున్నారు.
మృతురాలు కాలి పోయి పడి ఉన్న కోణంలోనూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్తుమార్టం నివేదిక అందితే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. నిందితుడి కుటంబ సభ్యులులందరూ పోలీసుల అదుపులో ఉన్నారు.
వేధింపులే ప్రాణం తీశాయా..!
Published Mon, Nov 25 2013 6:46 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement