bhimgall
-
టీఆర్ఎస్ నేత హత్య: ఆ తర్వాతే అంత్యక్రియలు
సాక్షి, భీమ్‌గల్(నిజామాబాద్): భీమ్‌గల్ మండల కేంద్రంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భూ తగాదాల నేపథ్యంలో టీఆర్ఎస్ నేత, మాజీ వార్డు సభ్యుడు కలీం హత్యకు నిరసనగా బంద్‌కు పిలుపునివ్వడం, మృతదేహంతో ఆందోళన చేపట్టడంతో రోజంతా తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. అయితే, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పరిస్థితి అదుపు తప్పకుండా చూశారు. భూ తగాదాలతో హత్యకు గురైన భీమ్‌గల్‌కు చెందిన కలీం సోమవారం మండలంలోని బాబాపూర్‌లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యకు నిరసనగా మంగళవారం రోజంతా భీమ్‌గల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కలీం మృతదేహానికి సోమవారం రాత్రి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఇంటికి తరలించారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, అతని వర్గం వారు హంతకులను కఠినంగా శిక్షించే వరకు అంత్యక్రియలు నిర్వహించొద్దని నిర్ణయించారు. మంగళవారం భీమ్‌గల్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి పట్టణంలో యువకులు పెద్ద సంఖ్యలో బైకులపై ర్యాలీ చేపట్టారు. మృతదేహంతో ఆందోళన.. ఉదయం 10 గంటల సమయంలో కలీం మృతదేహాన్ని తహసీల్దార్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే వందలాది మంది అక్కడకు తరలివచ్చారు. మృతదేహాన్ని కార్యాలయంలోకి తీసుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. కొందరు యువకులు గేట్లు తోసుకుని లోపలికి వెళ్లగా, పోలీసులు అతి కష్టం మీద వారిని బయటకు పంపించారు. హంతకులను శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కలెక్టర్, మంత్రి రావాలని, అప్పటిదాకా అంత్యక్రియలు నిర్వహించేది లేదని స్పష్టం చేశారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. చివరకు మైనారిటీ నాయకులతో అధికారులతో చర్చలు జరిపి ఆందోళనను విరమింపజేశారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారంతో పాటు ఐదెకరాల భూమి ఇప్పించాలని కోరగా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో సాయంత్రం 4 గంటలకు ఆందోళన విరమించి అంతిమ యాత్ర నిర్వహించారు. తహసీల్ కార్యాలయం ఎదుట బైఠాయించిన ముస్లిం మహిళలు ప్రశాంతంగా బంద్ కలీం హత్యకు నిరసనగా చేపట్టిన భీమ్‌గల్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూసి ఉంచారు. బస్సులు, ఆటోలు నడువలేదు. భారీ బందోబస్తు.. సోమవారం నాటి ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. అడిషనల్ ఎస్పీ భాస్కర్, ఆర్మూర్, నిజామాబాద్ ఏసీపీలు రఘు, శ్రీనివాస్‌కుమార్, ఎస్బీ ఏసీపీ శ్రీనివాస్‌రావ్, స్థానిక సీఐ సైదయ్య, ఎస్సై శ్రీధర్‌రెడ్డిలతో పాటు జిల్లాలోని పలువురు సీఐలు, ఎస్సైలు బందోబస్తుకు తరలి వచ్చారు. ప్రత్యేక బలగాలను దింపి పరిస్థితి అదుపు తప్పకుండా పర్యవేక్షించారు. పరామర్శించిన మాజీ మంత్రి కలీం హత్య వార్త తెలిసి మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి భీమ్‌గల్‌కు వచ్చారు. కలీం మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అతనితో తనకున్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రితో పాటు డీసీసీ మాజీ అధ్యక్షుడు తాహెర్, మాజీ జెడ్పీటీసీ ప్రకాష్‌గౌడ్ తదితరులు కలీం కుటుంబ సభ్యులను ఓదార్చారు. పరామర్శకు వచ్చిన మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి -
ఆ రెండు కేసులతో తన ప్రమేయంలేదని..
సాక్షి భీమ్‌గల్: మండలంలోని చేంగల్ గ్రామంలో మగ్గిడి సచిన్(24) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ శ్రీధర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. మగ్గిడి సచిన్ శనివారం రాత్రి పడుకునేందుకు ఇంటి మేడపైకి వెళ్లాడు. ఆదివారం ఉదయం ఎంతకూ లేవకపోవడంతో సచిన్ తండ్రి సంజీవయ్య మేడపైకి వెళ్లగా ఎంతకూ గది తలుపులు తెరవకపోవడంతో అనుమానంతో తలుపులు బద్దలు కొట్టాగా దూలానికి ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యు లు ఒక్క సారిగా షాక్‌కు గురయ్యారు. సచిన్‌పై గతంలో పలు పోలీసు కేసులు నమోదు కాగా పలుమార్లు రిమాండ్‌కు వెళ్లివచ్చాడు. గతంలో గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న సాయి దీక్షిత ఆత్మహత్య వ్యవహారంలో నిందితుడుగా ఉన్నాడు. సాయి దీక్షిత, సచిన్ ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో సాయి దీక్షిత ఆత్మహత్యపై పెళ్లుబికిన విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో సచిన్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించగా బెయిల్‌పై వచ్చిన అనంతరం కోర్టుకు హాజరవుతున్నాడు. అనంతరం కొద్ది రోజుల తర్వాత గ్రామ శివారులో మామిడి కాయల కోసం వచ్చిన వారిని దుండగులుగా భావించి గ్రామస్తులు తీవ్రంగా కొట్టి స్థానిక గ్రామ కమిటీ భవనంలో బంధించిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సందర్భంగా మృతుల తరపువారు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా పోలీసులు అప్పుడు వీడియోలో కనిపించిన పలువురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. ఆ ఘటనలో కూడా తన ప్రమేయం లేకున్నా అక్కడ నిలబడి ఉన్నందుకు తనపై అనవసరంగా కేసులు నమోదు చేసారని తరచూ స్థానికులతో వాపోయే వాడు. రెండు కేసులలో తన ప్రమేయం లేకున్నా ఇరుక్కుని ఇబ్బందులకు గురవుతన్నానని మానసిక వేదన చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు. -
వేధింపులే ప్రాణం తీశాయా..!
భీమ్‌గల్, న్యూస్‌లైన్: శుక్రవారం రాత్రి కిరోసిన్ పోసుకుని నిప్పం టించుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డ భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ గ్రామానికి చెంది న కూన మాధవి (20) మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లయి ఏడాది కూడా గడవకముందే ఆమె బల వన్మరణానికి పాల్పడడానికి బలపైన కారణాలు ఎంటన్నదానిపైనే గ జరుగుతోంది. మండలంలోని బాబాపూర్ గ్రామానికి చెందిన మోహన్, పద్మ దంపతుల ఏకైక కుమార్తె మాధవిని గతేడాది డిసెంబర్లో బడాభీమ్‌గల్‌కు చెందిన మేనళ్లుడైన కూన శ్రీనివాస్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే ఈ వివాహం శ్రీని వాస్కు ఇష్టం లేదని తెలుస్తుంది. పెద్దల ఒత్తిడి మేరకు వివాహం చేసుకున్న ఆయన తన భార్యను తరచూ వేధించేవాడని మృతురాలి బంధువులు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడు శ్రీనివాస్ ఏపని లేక జులాయిగా తిరిగేవాడని, తరుచూ భార్యతో గొడవ పడేవాడని స్థానికుల మాటలను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో మాధవి ఇంట్లో గదిలో గడియ పెట్టుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుని ఆత్మహత్యకు ఒడిగట్టింది. మృతురాలు నాలుగు నెలల గర్భిణి అని తెలిసింది. పెళ్లయి ఏడాదైన గడవకముందే నిండు నూరేళ్ల జీవితం ముగియడంపై బంధువులు, కుటంబీకులు కంట తడి పెడుతున్నారు. మృతురాలు కాలి పోయి పడి ఉన్న కోణంలోనూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్తుమార్టం నివేదిక అందితే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. నిందితుడి కుటంబ సభ్యులులందరూ పోలీసుల అదుపులో ఉన్నారు.