సాక్షి, విజయవాడ : జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఏ ప్లస్ కన్వెన్షన్‌లో సోమవారం జరిగే ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని ప్రతిభావంతులకు విద్యాపురస్కారాలు అందజేస్తారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ ఏడాది టెన్త్, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అబుల్ కలాం ఆజాద్ విద్యా పురస్కారాలను అందజేయనున్నట్లు విదాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. భారత మొదటి విద్యాశాఖమంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవడం తెలిసిందే. నేడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ 131వ జయంతి.
Comments
Please login to add a commentAdd a comment