శ్రీకాకుళం పట్టణంలోని ఐటీడీఏ పోస్ట్‌మెట్రిక్ బాలుర వసతి గృహంలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించారు.
శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణంలోని ఐటీడీఏ పోస్ట్‌మెట్రిక్ బాలుర వసతి గృహంలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించారు. 308 మంది విద్యార్థులకు 173 మందే ఉన్నట్టు గుర్తించారు. అలాగే పారిశుద్ధ నిర్వహణ సరిగా లేదని, రికార్డుల నిర్వహణ కూడా సరిగా లేదని గుర్తించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని ఏసీబీ డీఎస్పీ కె.రంగరాజు తెలిపారు. సోదాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి.