వెంకట్రామయ్యతో నాటకం ఆడించారు: ఆదాల | Adala Prabhakara Reddy confident his victory in Rajya Sabha Poll | Sakshi
Sakshi News home page

వెంకట్రామయ్యతో నాటకం ఆడించారు: ఆదాల

Published Fri, Jan 31 2014 4:17 PM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

వెంకట్రామయ్యతో నాటకం ఆడించారు: ఆదాల

వెంకట్రామయ్యతో నాటకం ఆడించారు: ఆదాల

హైదరాబాద్: నామినేషన్ ఉపసంహరణ లేఖ తాను ఎవ్వరికీ ఇవ్వలేదని రాజసభ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగిన ఆదాల ప్రభాకరరెడ్డి తెలిపారు. రాజ్యసభ ఎన్నికల బరిలో కొనసాగుతున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూడుసార్లు తనకు ఫోన్‌ చేసి నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరారని వెల్లడించారు. సీఎం సూచనను పరిశీలిస్తానని మాత్రమే చెప్పానని తెలిపారు.

సమైక్యాంధ్ర ప్రతిష్ట కోసం సీమాంధ్ర ప్రజలు తమ నియోజకవర్గ ఎమ్మెల్యేలను తనకు ఓటేసేలా ఒప్పించాలని కోరారు. ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యతో ఎవరో నాటకం ఆడించారని ఆరోపించారు. వెంకటరామయ్యను అమాయకుడిని చేసి నామినేషన్‌ ఉపసంహరణ పత్రాన్ని ఇప్పించేలా చూశారన్నారు. ఇదేమీ అన్యాయం అంటూ రిటర్నింగ్‌ అధికారికి ఫోన్‌ చేశానని చెప్పారు. నామినేషన్ ఉప సంహరణ పత్రంపై తన సంతకం చేసిన వారిపై క్రిమినల్ కేసు పెడతానని ఆయన హెచ్చరించారు. తనకు 175 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉటుందని, తాను తప్పకుండా గెలుస్తానని ఆదాల విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement