Adala Prabhakara Reddy
-
ఏపీలో రాజకీయంగా ప్రాముఖ్యత ఉన్న జిల్లా నెల్లూరు
-
విజయసాయిరెడ్డిని అందుకే కలిశాను పార్టీ మార్పుపై క్లారిటీ
-
బాబుపై ఆదాల ప్రభాకర్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..
-
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి భారీ ఝలక్
సాక్షి, నెల్లూరు: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి భారీ ఝలక్ తగిలింది. నియోజకవర్గ కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ ఎంపీ, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అయిన ఆదాల ప్రభాకర్‌రెడ్డికి మద్ధతు ప్రకటించారు. కార్పొరేటర్లతో పాటు ఎక్స్అఫిషియో మెంబర్లు మంగళవారం పార్టీ ఇన్‌ఛార్జి కార్యాలయానికి చేరుకుని.. తమ మద్ధతు అదాలకే అని పేర్కొన్నారు. అంతేకాదు మరో ఆరుగురు కార్పొరేటర్లు సైతం ఆదాల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో.. కోటంరెడ్డి బలం ఇద్దరు కార్పొరేటర్లకు చేరుకున్నట్లయ్యింది. ఈ సందర్భంగా.. నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి నియమించటం శుభపరిణామని కార్పొరేటర్లు పేర్కొన్నారు. నెల్లూర్ రూరల్‌లో పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని, ఆదాల ప్రభాకర్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని కార్పొరేటర్లు ఈ సందర్భంగా ప్రతినబూనారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కీలక నేత ఆనం విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ రూరల్ ఇన్ఛార్జిగా నియమితులైన ఆదాలకి ఘన స్వాగతం పలికాం. తాజా పరిణామంతో.. పార్టీకి రూరల్ లో తిరుగులేని ప్రజాబలం ఉందని మరోసారి సంకేతం వచ్చింది. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి కార్యకర్తలు కష్టపడి పనిచేస్తేనే శ్రీధర్ రెడ్డి గెలిచారు. గెలిచాక కష్టపడిన వారిని పక్కన పెట్టి పక్కపార్టీ వాళ్ళకి పదవులు ఇచ్చాడు. తన దగ్గర 12 సిమ్ లు ఉన్నాయని శ్రీధర్ రెడ్డి చెబుతున్నాడు. లిక్కర్, గంజాయి మాఫియా, హత్యలు చేసేవారు, అనైతిక కార్యక్రమాలు చేసే వారికే అన్ని సిమ్ లు ఉంటాయి . ఆదాలని ఇంచార్జ్ గా ప్రకటించగానే మంచి నిర్ణయం తీసుకున్నారని రూరల్ ప్రజలు సంతోషించారు. సర్పంచ్, ఎంపీపీ, ఎంపీటీసీలు అందరూ ఆదాల కి సంఘీభావం తెలుపుతున్నారు. కోటంరెడ్డి దగ్గర ఉన్న కొంతమంది కార్పొరేటర్లు కూడా ఆదాల వైపు వచ్చేస్తారు అని విజయ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేటర్లకు పూర్తి స్వేచ్ఛ: ఆదాల ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ కార్పొరేటర్లకు ఇకపై పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, ఎప్పుడైనా తనను కలవొచ్చని వైఎస్సార్సీపీ రూరల్ ఇన్‌ఛార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేటర్లు మద్ధతు ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ లైన్ దాటితే ఎవరినీ ఉపేక్షించం. మేము ఎవరినీ బతిమాలాడము. రౌడీయిజం.. బెదిరింపులు కనిపించవు. మీ పరిధిలో ఉన్న, మీ సమస్యలు అన్ని పరిష్కరించుకుందాం. మీకు ఎలాంటి భయం లేదు. అభివృద్ధి కోసం సీఎం తో చర్చించి నిధులు తీసుకొస్తా అని ఆదాల, కార్పొరేటర్లకు భరోసా ఇచ్చారు. -
మాట ఇచ్చారు.. నెరవేర్చారు
టీడీపీ ఐదేళ్ల పాలనలో తాగునీటికి ప్రజలు ఇబ్బందులుపడ్డారు. వ్యర్థాల నీటిని తాగి వ్యాధులబారిన పడ్డారు. దివంగత మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి హయాం నుంచి నల్లపరెడ్ల వైపే కోవూరు నియోజకవర్గ ప్రజలు నమ్మకముంచారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి తమ గోడును చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని సమస్యలను ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రూ.56 లక్షలతో వాటర్ప్లాంట్లు మంజూరు చేయించారు. దీంతో మత్స్యకారులతో పాటు మిగతా ప్రాంతాల్లోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసినందుకు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఆదాలకు కృతజ్ఞతలు తెలిపారు. సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం: కోవూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో వాటర్ప్లాంట్ల ఏర్పాటు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి రూ.56లక్షలు మంజూరు చేశారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. ఎన్నికల ప్రచారంలో వెళ్లిన తనకు ప్రజలు తాగునీటి సమస్యలు వివరించారన్నారు. ఈ విషయాన్ని ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించి నిధులు మంజూరు చేశారన్నారు. నిధులు మంజూరు చేసినందుకు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పనులకు సంబంధించి త్వరితగతిన ప్రొసీడింగ్స్ ఇచ్చినందుకు కలెక్టర్ శేషగిరిబాబుకు ధన్యవాదాలు తెలిపారు. నిధుల కేటాయింపు ఇలా.. ►విడవలూరు మండలం కొత్తూరు దగ్గరలోని పాతూరులో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించినట్లు ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ►విడవలూరు మండలంలోని బుసగాడిపాళెం గిరిజనకాలనీలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేశారు. ►విడవలూరు మండలంలోని రామతీర్థం పంచాయతీ రామలింగాపురంలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5 లక్షలు ఇచ్చారు. ►విడవలూరు మండలంలోని దంపూరు పంచాయతీ రామచంద్రాపురం గిరిజనకాలనీలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చే శారు. ►విడవలూరు మండలం ఊటుకూరు పల్లిపాళెంలో పైప్లైన్ల రీప్లేస్‌మెంట్‌కు సంబంధించి రూ.5 లక్షలు కేటాయించారు. ►విడవలూరు మండలం ఊటుకూరు పల్లిపాళెంలోని నివాసగృహాల తాగునీటి కుళాయిల కనెక్షన్ల కోసం రూ.లక్ష ఇచ్చారు. ►కోవూరు పట్టణంలోని నందలగుంట గిరిజనకాలనీలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేశారు. ►కోవూరు పట్టణంలోని పెళ్లకూరుకాలనీలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు నిధులు ఇచ్చారు. ►కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించారు. ►కోవూరు మండలం వేగూరు పంచాయతీ సీతారామపురంలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేశారు. ►కొడవలూరు మండలం ఆలూరుపాడు ఎగువమీద గిరిజనకాలనీలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించారు. ►ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాళెంలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరుచేశారని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. -
‘అందుకే చంద్రబాబు వంగి..వంగి దండాలు’
సాక్షి, నెల్లూరు : చంద్రబాబు నాయుడుకు ఓటమి తప్పదని తెలిసిపోయిందని, అందుకే వంగి, వంగి దండాలు పెడుతున్నారని నెల్లూరు వైఎస్సార్ సీపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నెల్లూరులో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ నేతలు డబ్బు, మద్యాన్ని విచ్చల విడిగా పంచుతున్నప్పటికి ప్రజలు మాత్రం వైఎస్సార్ సీపీకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం కడతానని చెప్పినా కమీషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఆరోపించారు. ప్రచారం కోసం ఎక్కడికి వెళ్లినా ప్రజలు వైఎస్ జగన్‌ను కోరుకుంటున్నారని, వైఎస్సార్ సీపీకి 150 కి పైగా అసెంబ్లీ, 22 లోక్ సభ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు ఎంతో తేడా ఉందన్నారు. గత ఐదేళ్లుగా టీడీపీ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి మేలు చేయలేదని, అందుకు ప్రజలు టీడీపీపై కోపంగా ఉన్నారనన్నారు. వైఎస్ జగన్‌కు ఓటు వేటు వేయాలనిఅన్ని వర్గాల ప్రజలు 15 రోజుల ముందే నిర్ణయించుకున్నారని చెప్పారు. -
‘ఆ మంత్రి వల్ల టీడీపీ పది స్థానాలు ఓడిపోతుంది’
-
‘ఆ మంత్రి వల్ల టీడీపీ పది స్థానాలు ఓడిపోతుంది’
సాక్షి, నెల్లూరు: తొలిసారి తాను 1999లో టీడీపీ అభ్యర్థిగా అల్లూరు నుంచి గెలిచి మంత్రి అయినప్పటి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నామీద కడుపు మంటని వైఎస్సార్సీపీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమిరెడ్డిని ఈ జిల్లాలో నాలుగు సార్లు వరసగా ప్రజలు ఓడించినా.. చంద్రబాబు నాయుడు ఆయనను మంత్రిని చేశారని అన్నారు. తాను టీడీపీలో ఉండడం, పదవులు చేపట్టడం సోమిరెడ్డికి ఇష్టం లేదని పేర్కొన్నారు. కాగా టీడీపీ ఎమ్మెల్యే జాబితాలో ప్రభాకర్ రెడ్డికి స్థానం కల్పించినా.. ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. నెల్లూరు వైఎస్సార్సీపీ లోక్‌సభ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకత్వంలో ఉన్న రాజకీయ దిగజారుడు అంశాలను ఆయన వివరించారు. సోమిరెడ్డి నిత్యం చంద్రబాబు చెవిలో తనపై ఉన్నవి లేనివి చెప్పి అబద్ధాలు సృష్టించేవారిని ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. వైఎస్సార్సీపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఇదే..! ‘‘టీడీపీలో ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి, అవమానాలకు గురిచేసి నన్ను మోసం చేశారు. నేను పార్లమెంట్, లేకపోతే కోవూరు అసెంబ్లీ అడిగాను, కానీ కావాలని నెల్లూరు రూరల్ టికెట్ ఇచ్చారు. అయినా పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసం పని చేస్తుంటే అడుగడుగనా అడ్డుకున్నారు. ఈ విషయాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని వెళ్తే సోమిరెడ్డి అడ్డువేసి నన్ను గంట వెయిటింగ్ చేయించారు. నన్ను పార్టీ నుంచి బయటకి పంపించాలని సోమిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జిల్లాలో ముఖ్య నాయకులను పార్టీ నుంచి పంపించడంలో సోమిరెడ్డి కీలక పాత్ర పోషించారు. నేను రూరల్‌లో టీడీపీ నుంచి గెలిచే పరిస్థితుల్లో నన్ను ఓడించేందుకు ప్రయత్నించడం సహించలేకపోయా. నేను బిల్లులు తీసుకుని పార్టీ మారారని ప్రచారం చేస్తున్నారు. బిల్లులు తీసుకున్నానని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా, రుజువు చేయకపోతే నువ్వు తప్పుకుంటావా. సోమిరెడ్డి వల్ల జిల్లాలో పది నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోనుంది. నాకు ప్రభుత్వం నుంచి రూ.50 కోట్ల బిల్లులు రావాలి, అవసరం అయితే కోర్టుకు వెళ్తా. నేను వచ్చాక ఆత్మకూరు, నెల్లూరు రూరల్ లో పార్టీని బలోపేతం చేశా, అనవసర ఆరోపణలు చేయడం తగదు. నన్ను కేసీఆర్ బెదిరించాడని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అసత్యాలు‘‘ అని అన్నారు. -
పార్టీని నాశనం చేసిందెవరో?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీలో వర్గవిభేదాలు షరామామూలుగా మారాయి. వేదికలు మాత్రమే మారుతున్నాయి. ప్రతి వేదికపై ఒక వర్గం మరో వర్గంపై పైచేయి సాధించుకునే క్రమంలో ఘాటు విమర్శలకు దిగుతోంది. తాజాగా నెలన్నరగా అధికారపార్టీలో ఆత్మకూరు పంచాయితీ ముగింపు లేని రీతిలో కొనసాగుతోంది. జిల్లా టీడీపీలో ఉన్న గ్రూప్‌లన్నీ ఆత్మకూరులో ఉండడం, ప్రతి ఒక్కరూ అక్కడివారు కావడంతో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం సంగం మండలంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి నిర్వహించిన పార్టీ సమావేశానికి మంత్రి సోమిరెడ్డి వర్గం పూర్తిగా గైర్హాజరైంది. దీనిపై ఆదాల ప్రభాకరరెడ్డి మంత్రి సోమిరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ఘాటు విమర్శలు చేయడం పార్టీలో మళ్లీ చర్చనీయాంశం అయింది. సోమవారం సంగం, ఆత్మకూరు మండలాల్లో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్, ఆత్మకూరు తాత్కాలిక ఇన్చార్జ్ ఆదాల ప్రభాకరరెడ్డి సమావేశాలు నిర్వహించారు. దీనికి యథావిధిగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అనుచరుడు, పార్టీ నేత కన్నబాబు, అలాగే పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు సన్నిహితంగా ఉండే డీసీసీ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ్‌రెడ్డి గైర్హాజరయ్యారు. ఇక కొత్తగా రంగంలోకి రావాలనుకుంటున్న బొల్లినేని కృష్ణయ్య ప్రతినిధిగా అతని సమీప బంధువు తాళ్లూరి గిరినాయుడు హాజరయ్యారు. దీనిపై ఆదాల ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ మంత్రి సోమిరెడ్డి పేరు చెప్పకుండా ఆయనపై ఫైర్ అయ్యారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తనని 2004 ఎన్నికల సమాయానికి పార్టీ నుంచి బయటకు పంపేశారని, మళ్లీ గత కొంతకాలంగా తనపై పార్టీలోని ఆయన సొంత మనుషుల ద్వారా విషప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. వీళ్లకి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి.. వాళ్లకి మంత్రి పదవి రావాలే తప్ప జిల్లాలో పార్టీ బాగుండాలని ఏమాత్రం లేదని, గోదావరి జిల్లాలో గెలిస్తే అధికారం వస్తుందనుకుంటున్నారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. గత ఎన్నికల్లో జిల్లాలో పార్టీకి నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా లేకుండా చేసిన పరిస్థితికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. మరోవైపు ఆదాల వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు సమాచారం. -
టీడీపీలో గ్రూప్ వార్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తీరుతో మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి అసంతృప్తికి గురయ్యారు. అది కూడా మంత్రి నారాయణ సమక్షంలో ఆయన క్యాంప్ కార్యాలయంలో ఈ వ్యవహారం జరగటంతో పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మంత్రి అపాయింట్మెంట్ ఆదాల కోరితే ఆయన కంటే ముందుగానే బీద రవిచంద్ర కుదరదని చెప్పటం, అది కూడా పార్టీ కార్యకర్తలు అందరి సమక్షంలో చెప్పటం, దీనికి మంత్రి మౌనం వహించటంతో ఆదాల కినుకు వహించారు. వెంటనే పార్టీ రాష్ట్ర అ«ధ్యక్షునికి దీనిపై ఆదాల ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇది కూడా సీఎం పర్యటన నేపథ్యంలో జరగటంతో పార్టీలో హాట్ టాపిక్ అయింది. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఇద్దరు గురుశిష్యులు. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. కొంత కాలంగా పార్లమెంట్ పరిధిలో కార్యక్రమాల్లో పార్లమెంట్ ఇన్చార్జి హోదాలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో శనివారం నగరంలో తెలుగుదేశం పార్టీ దళిత తేజం బహిరంగ సభ కార్యక్రమం జరగనుంది. ఈ సభకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లు, ఆర్థిక వ్యవహారాలు, ఇతర అంశాలపై చర్చించటానికి మంత్రి పి.నారాయణ క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో పాటు నగర నేతలు పలువురు పాల్గొన్నారు. సమావేశం ముగిశాక మాజీ మంత్రి ఆదాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ములుమూడిలో అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి నారాయణను ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా కోరారు. గడిచిన నాలుగేళ్లలో రూరల్ నియోజకవర్గంలో కార్యక్రమాలకు పెద్దగా రాలేదు. తప్పనిసరిగా రావాలని కోరారు. దీనికి మంత్రి నారాయణ బదులివ్వటానికి ముందే ఎమ్మెల్సీ బీద రవిచంద్ర జోక్యం చేసుకోని మంత్రి నారాయణ ఎలా వస్తారు. సీఎం కార్యక్రమంహడావుడిలో ఉంటారు. పొద్దునే ఏర్పాట్లు చూసుకోవాలి. ఆయన రావటం కుదరదని ఖరాఖండిగా చెప్పాడు. అది నగర నేతలు, డివిజన్ కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తల సమక్షంలో చెప్పటంతో ఆదాల తీవ్ర అసంతృప్తికి లోనై అక్కడి నుంచి వెంటనే వెనుదిరిగారు. మంత్రి నారాయణ కనీసం ఒక్కమాటకు కూడా మాట్లాడలేదు. దీంతో పార్టీలో తనకి ప్రాధాన్యం ఇవ్వటం లేదని, తాను కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నా నేతలు తీరు సరిగాలేదని ఆదాల తన అనుచరుల వద్ద ఆక్రోశం వెళ్లగక్కారు. మరోవైపు వెంటనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకు ఫోన్ చేసి బీద రవిచంద్ర తీరుపై ఫిర్యాదు చేశారు. నగరంలో ఫ్లైక్సీల హడావుడి శనివారం నగరంలో జరిగే దళిత తేజం కార్యక్రమం ఫైక్సీల హడావుడి కూడా పార్టీలో తీవ్ర చర్చకు దారీతీసింది. కొందరు దళిత నేతలు కూడా దీనిపై పార్టీ ముఖ్యుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నగరం అంతా దళిత తేజం ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు కానీ దానికి భిన్నంగా ఒక సామాజికవర్గం నేతలు ఫ్లెక్సీలు హడావుడి చేయటం అందులోనూ దళిత నేతలకు చోట లేకపోవటం గమనార్హం. ముఖ్యంగా గత 15 రోజులుగా దళిత తేజం విజయవంతం చేయండని పార్టీ దళిత నేతలుగా ఉన్న ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, మాజీ మంత్రులు బల్లి దుర్గాప్రసాద్, పరసా రత్నం, పార్టీ నేతలు నెలవల సుబ్రమణ్యం, జోత్స్నలత తదితరులు అన్ని నియోజకవర్గాల్లో తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలో నగరంలో భారీగా ఏర్పాటు చేసిన ఫ్లైక్సీల్లో దళిత నేతలు కల్పించలేదు. దీనికి భిన్నంగా నగరంలో ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి పట్టాభి, తాళ్లపాక అనురాధ తదితర నేతలు భారీగా ఫ్లైక్సీలు ఏర్పాటు చేయటం పార్టీ అలంకరణ కమిటీకి తలనొప్పిగా మారింది. పరసా హడావుడి మరోవైపు సీఎం పర్యటన పేరుతో పరసా రత్నం హడావుడి చేశారు. శుక్రవారం పెళ్లకూరులో సమావేశం నిర్వహించి జనసమీకరణ బాధ్యత అధికారులకు అప్పగించారు. ఏపీఎం పద్మ, ఉఫాధి హామీ ఏపీఓ జ్ఞాన ప్రకాష్‌తో కలిసి ఆయన సమావేశం నిర్వహించి పొదుపు సంఘాల మహిళలు, ఉపాధి హమీ కూలీలతో మాట్లాడి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసీ జనాలను తరలించాలని ఆదేశాలు జారీ చేయటం చర్చనీయాంశం అయింది. -
రాజీ కుదిరింది
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ టికెట్ల విషయంలో నువ్వా? నేనా? అనే రీతిలో తెర రాజకీయ యుద్ధానికి దిగిన పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఈ నెల 5వ తేదీన పార్టీలో చేరబోతున్న సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి మధ్య రాజీ కుదిరినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కోవూరు టికెట్ పోలంరెడ్డికే ఇప్పించాలని ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర చేసిన ప్రయత్నాలకు ఆదాల చేయూతనందించారు. చివరకు ఈ టికెట్ వ్యవహారం ఆదాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో పార్టీ సాధారణ కార్యకర్తల్లాగానే సోమిరెడ్డి అధినేత చంద్రబాబు వద్ద తన అక్కసు, ఆవేదన వెల్లగక్కిన విషయం తెలిసిందే. కోవూరు టికెట్ పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి ఇవ్వాలని ఆయన గట్టిగా పట్టుబట్టారు. దీంతో చంద్రబాబు రంగంలోకి దిగి ఆదాల- సోమిరెడ్డి మధ్య మధ్యస్తం చేసే బాధ్యతను పార్టీ నాయకుడు సుజనా చౌదరికి అప్పగించారని సమాచారం. ఇటీవల ప్రజాగర్జన సభ ఏర్పాట్ల కోసం నెల్లూరు వచ్చిన సుజనా చౌదరి ఈ ఇద్దరు నేతలతో సుదీర్ఘ మంతనాలు సాగించి కొన్ని షరతులతో ఎట్టకేలకు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారని టీడీపీలో గుప్పుమంటోంది. ఈ రాజీ సూత్రం ప్రకారం కోవూరు పోలంరెడ్డికి, నెల్లూరు రూరల్ సోమిరెడ్డికి, సర్వేపల్లి పెళ్లకూరుకు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని ప్రచారం సాగుతోంది. తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో తలదూర్చననే షరతుతో సోమిరెడ్డితో ఆదాల రాజీకి అంగీకరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. -
రాజ్యసభకు ఆ ఆరుగురు..
కేవీపీ, టీఎస్సార్, ఎంఏ ఖాన్ (కాంగ్రెస్), గరికపాటి, సీతారామలక్ష్మి (టీడీపీ), కేకే (టీఆర్ఎస్)లు ఎన్నిక సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి రంగం నుంచి తప్పుకోవడంతో రాజ్యసభ ఎన్నికల్లో ఆరు స్థానాలకు అభ్యర్థుల ఎన్నిక శుక్రవారం లాంఛ నంగా ముగిసింది. కాంగ్రెస్ నుంచి కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, ఎంఏ ఖాన్, టీడీ పీ నుంచి గరికపాటి మోహన్‌రావు, తోట సీతారామలక్ష్మి, టీఆర్ఎస్ నుంచి కె.కేశవరావు (కేకే) ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజసదారాం శుక్రవారం రాత్రి విజేతలకు ధ్రువపత్రాలు అందించారు. అసెంబ్లీ కమిటీ హాల్-1లో శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. అసెంబ్లీలోని 294 స్థానాలకు గాను 15 ఖాళీగా ఉన్నాయి. ముగ్గురికి (సుమన్‌రాధోడ్, జనార్దన్ థాట్రాజ్, చెన్నమనేని రమేష్) ఓటు హక్కు లేదు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన 17 మందితో పాటు ఆపార్టీకి మద్దతిస్తున్న ఆరుగురు ఎమ్మెల్యేలు (ఆదినారాయణరెడ్డి, రాజన్నదొర, పినిపె విశ్వరూప్, మోపిదేవి వెంకటరమణ, కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి, కాటసాని రామిరెడ్డి), బీజేపీ, దాని అనుబంధ ఎమ్మెల్యేలు (కిషన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ఎన్నం శ్రీనివాసరెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి), సీపీఎంకు చెందిన జూలకంటి రంగారెడ్డి ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మిగతా 248 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రథమ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఎంఏ ఖాన్‌కు 49, కేవీపీ రామచంద్రరావుకు 46, టి.సుబ్బిరామిరె డ్డికి 46, గరికపాటి మోహన్‌రావుకు 38, తోట సీతారామలక్ష్మికి 38, కేశవరావుకు 26 ఓట్లు వచ్చాయి. గురువారం రంగం నుంచి తప్పుకున్న తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డికి ఒక్క ఓటు కూడా రాలేదు. దీంతో తప్పింపు పద్ధతిలో ప్రథమ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులోనే ఆదాల ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పెద్దల సూచన మేరకు ఆయన తన మొదటి ప్రాధాన్య ఓటును సుబ్బిరామిరెడ్డికి వేశారు. రెండో ప్రాధాన్య ఓటును కేవీపీకి వేయాలని ఆదాలకు సూచించినప్పటికీ, ఆయన ఆ ఓటును వినియోగించుకోలేదు. ఆరు స్థానాలకు ఆరుగురే బరిలో ఉండటంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సిన అవసరం లేకుండాపోయింది. ఎవరికెన్ని ప్రథమ ప్రాధాన్య ఓట్లు వచ్చాయో లెక్కించిన తర్వాత అధికారులు విజేతలను అధికారికంగా ప్రకటించారు. ఓట్లు వేసినప్పుడు తప్పితే మిగతా సమయంలో ఎమ్మెల్యేలను సైతం పోలింగ్ కేంద్రం, అసెంబ్లీ లాబీల్లోకి కూడా అనుమతించలేదు. తొలి ఓటు స్పీకర్‌దే ముందుగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీనియర్ మంత్రులు ఓట్లు వేశారు. అనారోగ్యంతో ఉన్న మణెమ్మకు సహాయకారిగా ఆమె కుమార్తె, పి.శంకర్రావుకు సహాయంగా సీఎల్పీ ఇన్చార్జి శ్రీకాంత్‌లు వారి సూచనల మేరకు ఓటు వేశారు. చిట్టచివరగా జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఓటు వేశారు. తెలంగాణ ఎమ్మెల్యేలు ద్వితీయ ప్రాధాన్య ఓటును కె.కేశవరావుకు వేయగా, కొందరు తృతీయ ప్రాధాన్య ఓటును కేవీపీ రామచంద్రరావుకు వేశారు. గ్రూపులతో హడావుడి.. ఓటింగ్‌లో అందరూ ఒక్కటై రాజ్యసభ ఎన్నికల పొలింగ్‌కు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రూపులుగా విడిపోయి కొద్దిసేపు హడావుడి చేశారు. అయితే, ఓటింగ్‌కు వచ్చేసరికి అందరూ పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకున్నారు. ఎవరు ఎవరికి ప్రథమ, ద్వితీయ ప్రాధాన్య ఓట్లు వేయాలో పార్టీ నేతలు స్పష్టంగా నిర్దేశించారు. అనుబంధ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌తో కలుపుకొని కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యేలు 50 మంది ఉన్నారు. వీరిలో 46 మంది ఎం.ఎ.ఖాన్‌కు ప్రథమ ప్రాధాన్య ఓటు వేయాలని నిర్ణయించారు. దానం నాగేందర్, జయసుధలను కేవీపీ రామచంద్రరావుకు, కూన శ్రీశైలం గౌడ్, సుధీర్‌రెడ్డిలను టి.సుబ్బిరామిరెడ్డికి కేటాయించారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలతో కేవీపీ, సుబ్బిరామిరెడ్డిలకు ప్రథమ, ద్వితీయ ప్రాధాన్య ఓట్లు వేయించారు. ఓట్ల కేటాయింపునకు సీఎం శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు జూబ్లీహాల్లో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలెవరూ ఈ విందుకు హాజరుకాలేదు. దీంతో సీఎం సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు ఓట్లు ఎవరికి ఎలా వేయాలో సూచనలు చేశారు. మరోవైపు తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు గోల్కొండ హోటల్లో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాంతానికే చెందిన రాజ్యసభ అభ్యర్థులకే ఓటు వేయాలని నిర్ణయించారు. పార్టీ అభ్యర్థి విజయానికి పోగా మిగిలిన ఓట్లను టీఆర్ఎస్ అభ్యర్థికి వేయాలని నిర్ణయించారు. ఈ విషయం తెలిసి పీసీసీ అధ్యక్షుడు బొత్స అక్కడికి వచ్చారు. పార్టీ అభ్యర్థులకు మాత్రమే మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని, రెండో ప్రాధాన్య ఓటు ఎవరికీ వేయొద్దని సూచించారు. బొత్స వెళ్లిపోగానే టీఆర్ఎస్ అభ్యర్థి కె.కేశవరావు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు అక్కడికి వచ్చారు. ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, జానారెడ్డి తదితరులతో చర్చించారు. కనీసం ఏడు లేదా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేశవరావుకు మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని నిర్ణయించారు. తీరా ఓటింగ్‌కు వచ్చేసరికి ఒక్కరు మినహా టీ ఎమ్మెల్యేలందరూ మొదటి ప్రాధాన్య ఓటును పార్టీ సూచించిన అభ్యర్థులకే వేశారు. మేయర్ పదవితో ఎంఐఎం ఓట్లు పోలింగ్ జరుగుతున్న సమయంలో అసెంబ్లీ ఆవరణకు వచ్చిన ఎంఐఎం ఎమ్మెల్యేలు ఓట్లు వేయకుండా తమ కార్యాలయంలోనే కూర్చున్నారు. దీంతో మంత్రులు జానారెడ్డి, సారయ్య, కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎ ఖాన్లు వారితో చర్చించారు. హైదరాబాద్ మేయర్ పదవిని పూర్తి కాలం ఎంఐఎంకే వదిలిపెడతామని, తమకు ఓటు వేయాలని కోరారు. చివరకు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. జేపీ, చిన్నం రామకోటయ్య ఓటు టీడీపీకే టీడీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను మినహాయిస్తే అసెంబ్లీలో టీడీపీ బలం 75 మాత్రమే. అందులో సుమన్ రాథోడ్‌పై కోర్టు కేసు కారణంగా ఆమెకు ఓటు హక్కు లేకుండా పోయింది. మిగిలిన 74 మందికిగాను ఆ పార్టీ ఇద్దరు అభ్యర్థులకు 76 ఓట్లు వచ్చాయి. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య టీడీపీ అధికారిక అభ్యర్థికే ఓటు వేశారు. లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ కూడా టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో గరికపాటి, తోట సీతారామలక్ష్మిలకు చెరో 38 ఓట్లు వచ్చాయి. రాజ్యసభ సీటు ఇవ్వలేదని అలకబూనిన మోత్కుపల్లి నర్సింహులుకు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పట్నం మహేందర్‌రెడ్డిలు నచ్చజెప్పడంతో ఆయన ఆఖరి నిమిషంలో వచ్చి ఓటు వేశారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకోలేదని, సీనియర్లకు న్యాయం చేయలేదని మోత్కుపల్లి విమర్శించారు. కేకేకు మొదటి ఓటేసిన ఒకే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల నుంచి ఎన్నో కొన్ని మొదటి ప్రాధాన్యత ఓట్లు ఆశించిన టీఆర్ఎస్ అభ్యర్థి కేకేకు ఆ ఆశ నెరవేరలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్కరు మాత్రమే ప్రథమ ప్రాధాన్య ఓటు వేశారు. టీఆర్ఎస్ 16 (17లో చెన్నమనేనికి ఓటు హక్కు లేదు), సీపీఐ 4, ఆ పార్టీకి మద్దతిస్తున్న మరో నలుగురు టీడీపీ అసంతృప్తులు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేతో కలిపి కేకేకు 26 మాత్రమే మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి. మెదక్ జిల్లా గద్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే నరసారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేశారని ప్రచారం ఉంది. 42మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేకేకు రెండో ప్రాధాన్య ఓటు వేశారు. సీపీఐ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొదటి ప్రాధాన్య ఓటు మాత్రమే వినియోగించుకున్నారు. మీ సబ్‌కాంట్రాక్టర్ ఆదాల పోలింగ్ జరుగుతున్న సమయంలో టి.సుబ్బిరామిరెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఎదురుపడ్డారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా తనకే ఓటు వేశారని సుబ్బిరామిరెడ్డి గొప్పగా చెప్పబోతుండగా.. ‘‘చాల్లెండి. ఆయన మీ సబ్‌కాంట్రాక్టర్‌గా అనేక పనులు చేస్తున్నాడు. మీకు కాకుండా వేరే వాళ్లకు వేస్తాడా’’ అని వివేకానందరెడ్డి అనడంతో సుబ్బిరామిరెడ్డి మారు మాట్లాడలేదు. చెల్లని ఓట్లు ఎవరివి? కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిరస్కరణ ఓటు వేశారు. నాలుగు ఓట్లు చెల్లలేదు. ఈ నాలుగూ ఎవరిదన్న విషయంపై పెద్ద చర్చే జరిగింది. గంగుల కమలాకర్‌రెడ్డి, హనుమంత్ షిండేలు టీఆర్ఎస్కు ఓటు వేయడంతో వారి ఓట్లను పరిగణనలోకి తీసుకోరాదని టీడీపీ ఎన్నికల అధికారికి లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. అలాగే విద్యాసాగర్‌రావు, జేసీ దివాకర్‌రెడ్డిలు బ్యాలెట్ పత్రాలను అందరికీ చూపించినందుకు వారి ఓట్లను చెల్లనివిగా ప్రకటించాలన్న డిమాండ్ వచ్చింది. అయితే ఎన్నికల అధికారులు టీడీపీ ఫిర్యాదుతోపాటు జేసీ, విద్యాసాగర్రావులపై వచ్చిన డిమాండ్లను తోసిపుచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాండ్రు కమల తొట్రుపాటు పడి ప్రాధాన్య ఓటును గుర్తించకుండానే వట్టి బ్యాలెట్ పత్రాన్ని బాక్సులో వేశారు. మరో ఎమ్మెల్యే నీరజారెడ్డి కూడా ఓటు వేయకుండా బ్యాలెట్ పత్రాన్ని బాక్సులో వేసినట్లు ప్రచార ం జరిగింది. బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ, ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్లు ప్రాధాన్య ఓటు కింద అంకెలు వేయకుండా టిక్కులు పెట్టడంతో వారి ఓట్లు చెల్లలేదు. -
కాంగ్రెస్.. రెబల్ డ్రామా
' టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు మార్గం సుగమం చేసిన సీఎం కిరణ్ ' రాజ్యసభ బరిలోంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన చేసిన ఆదాల ' విరమణ వెనుక భారీ ప్యాకేజీ, లావాదేవీలు జరిగినట్టు సమాచారం ' వైఎస్సార్ సీపీ సహకరించని కారణంగా వైదొలుగుతున్నట్టు ఆదాల ప్రకటన ' నామినేషన్ల పర్వం ప్రారంభం కాకముందే ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిని రంగంలోకి దింపి ఇంతకాలం హైడ్రామా నడిపిన కాంగ్రెస్ బండారం బయటపడింది. సమైక్యవాదం కోసమంటూ కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలో నిలిచిన ఆ పార్టీ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డిని పోలింగ్‌కు ఒకరోజు ముందు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. బరి నుంచి వైదొలిగేలా చేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు తాను పోటీ నుంచి తప్పుకుంటున్నానని ఆదాల గురువారం ప్రకటన చేశారు. ఆయన గురువారం ఎమ్మెల్యేలు జేసీ దివాకర్‌రెడ్డి, శ్రీధర్కృష్ణారెడ్డిలతో కలిసి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. పోటీనుంచి తప్పుకునే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం జేసీ, శ్రీధర్కృష్ణారెడ్డిలతో కలిసి సీఎల్పీ కార్యాలయం వద్దకు చేరుకుని తాను పోటీనుంచి విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సహకరించబోమన్నారని, అందువల్లే బరినుంచి తప్పుకుంటున్నానని ఆదాల చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విలేక రులడిగిన పలు ప్రశ్నలకు జవాబు చెప్పకుండా పక్కనున్న జేసీని మాట్లాడాలంటూ సూచించి పక్కకు తప్పుకున్నారు. ఎన్నికల్లో సమైక్యవాదులంతా తనకు ఓటు వేస్తారని, 42 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పిన ఆదాల చివరి నిమిషంలో ఇలా తప్పుకోవడానికిగాను భారీ ప్యాకేజీలతో అవగాహన కుదిరినట్టు సమాచారం. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి కె. కేశవరావు గెలుపునకు ముఖ్యమంత్రి మార్గం సుగమం చేయడంతో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్యాకేజీలో.. రికవరీ మాఫీ ఆదాల నెల్లూరు జిల్లాలోని ఒక ప్రాజెక్టు అధునీకరణ పనుల కాంట్రాక్టు పొందగా, ఆ పనులు నాసిరకంగా ఉన్నాయని, దానిపై చెల్లించిన మొత్తంలో రూ.25 కోట్లను కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయాల్సిందిగా విజిలెన్స్ నిగ్గుతేల్చిందని చెబుతున్నారు. ఇప్పుడు రాజ్యసభ బరిలో నుంచి తప్పుకోవడం ద్వారా ఆ రికవరీని మాఫీ చేయడానికి అంగీకారం కుదిరిందని సమాచారం. అలాగే జిల్లాలో వరద నివారణకు సంబంధించి రూ.68 కోట్ల విలువైన ఎత్తిపోతల పథకాన్ని నామినేషన్‌పై కట్టబెట్టడానికి కూడా అవగాహనకొచ్చారని కాంగ్రెస్‌లో బలంగా వినిపిస్తోంది. ఎత్తిపోతల ఫైలు ప్రస్తుతం ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉందని సమాచారం. మొదటి నుంచి ప్లాన్ ప్రకారమే... అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ సాగుతున్న తరుణంలో సమైక్యవాదం కోసం పోరాడుతున్నట్లు ఎమ్మెల్యేలను భ్రమల్లో ఉంచడం, చివరి నిమిషంలో రంగం నుంచి తప్పించడం ద్వారా సీఎం రెండు రకాల ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు ఆదాలతో రెబల్‌గా నామినేషన్ వేయించారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే తనకు 20 మంది ఎమ్మెల్యేల బలం ఉందని స్వతంత్ర ఎమ్మెల్సీ చైతన్యరాజు నామినేషన్ వే యడంతో సీఎం ఇరకాటంలో పడ్డారు. చైతన్యరాజు బరిలో ఉంటే చివర్లో పోటీనుంచి తప్పుకొనే పరిస్థితి ఉండదని, దీంతో ఓటమి తప్పదన్న అంచనాకు వచ్చారు. దీంతో పార్టీ రెబెల్ అభ్యర్థి ఆదాలను తప్పించే బదులు పార్టీకి సంబంధం లేని స్వతంత్ర అభ్యర్థి బరి నుంచి వైదొలగేలా చేయడానికి ఆయన అనేకరకాల ఒత్తిళ్లు చేశారని అంటున్నారు. నెపం వైఎస్సార్ కాంగ్రెస్‌పై.. - ప్రాజెక్టు ప్యాకేజీల విషయం బయటికి రాకుండా ఆదాలను తప్పించే విషయంలో వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ నేతలు నిందను వైఎస్సార్ కాంగ్రెస్‌పై నెట్టేందుకు ప్రయత్నించినట్టు స్పష్టమైంది. - వాస్తవానికి సంఖ్యాబలంలేనందున తాము పోటీ చేయబోమని, ఏ అభ్యర్థికీ మద్దతు ఇవ్వబోమని వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ప్రకటించింది. పైగా ఎమ్మెల్యేలకు విప్ కూడా జారీ చేసింది. - గురువారం ఉదయం సీఎం తన క్యాంపు కార్యాలయంలో తన పార్టీకి చెందిన 27 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు వీలుగా పోటీ నుంచి తప్పుకోవాలని, వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడం వల్లనే తాను వైదొలగుతున్నట్లు చెప్పాలని ఆదాలకు సీఎం ఈ సమావేశంలో సూచించినట్లు సమాచారం. - ఈ సమావేశంలోనే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో సీఎం ఫోన్లో సంప్రదింపులు జరిపి వారిచ్చిన సూచనల మేరకు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. - ఆదాలకు ఓటు వేయాలని పార్టీ ఎమ్మెల్యేలను అడిగితే సీఎం చెబితే వేస్తామంటున్నారని, సీఎం మాత్రం ఆదాలనే తప్పుకోమని చెబుతున్నారని సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి సీఎల్పీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పేర్కొన్నారు. కాగా, ఎవరు ఎవరికి ఓటు వేయాలన్నదానిపై శుక్ర వారం ఉదయం పార్టీ ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేసిన తేనీటి విందులో సీఎం వివరించనున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. - అదనపు ఓట్లు కేకేకు: సీఎం సహాతెలంగాణ నేతలతో చర్చించిన అధిష్టానం అదనపు ఓట్లను టీఆర్ఎస్ అభ్యర్థికి అనధికారికంగా కేటాయించేలా సూచనలు అందించినట్లు తెలుస్తోంది. -
వెంకట్రామయ్యతో నాటకం ఆడించారు: ఆదాల
హైదరాబాద్: నామినేషన్ ఉపసంహరణ లేఖ తాను ఎవ్వరికీ ఇవ్వలేదని రాజసభ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగిన ఆదాల ప్రభాకరరెడ్డి తెలిపారు. రాజ్యసభ ఎన్నికల బరిలో కొనసాగుతున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూడుసార్లు తనకు ఫోన్ చేసి నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరారని వెల్లడించారు. సీఎం సూచనను పరిశీలిస్తానని మాత్రమే చెప్పానని తెలిపారు. సమైక్యాంధ్ర ప్రతిష్ట కోసం సీమాంధ్ర ప్రజలు తమ నియోజకవర్గ ఎమ్మెల్యేలను తనకు ఓటేసేలా ఒప్పించాలని కోరారు. ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యతో ఎవరో నాటకం ఆడించారని ఆరోపించారు. వెంకటరామయ్యను అమాయకుడిని చేసి నామినేషన్ ఉపసంహరణ పత్రాన్ని ఇప్పించేలా చూశారన్నారు. ఇదేమీ అన్యాయం అంటూ రిటర్నింగ్ అధికారికి ఫోన్ చేశానని చెప్పారు. నామినేషన్ ఉప సంహరణ పత్రంపై తన సంతకం చేసిన వారిపై క్రిమినల్ కేసు పెడతానని ఆయన హెచ్చరించారు. తనకు 175 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉటుందని, తాను తప్పకుండా గెలుస్తానని ఆదాల విశ్వాసం వ్యక్తం చేశారు. -
నామినేషన్ ఉపసంహరించుకుంటా.. కానీ
హైదరాబాద్: వ్యాపారాల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని రాజ్యసభ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎమ్మెల్సీ చైతన్య రాజు అన్నారు. బరిలోంచి తప్పుకోవాలని తనకు బెదిరింపులు వచ్చిన మాట వాస్తమేనని ఆయన అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన తన పట్ల పార్టీ వ్యవహరించిన తీరు బాధ కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విభజన ప్రక్రియను ఎన్నికల వరకు ఆపుతామంటే నామినేషన్ ఉపసంహరించుకుంటానని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగానే తాను రాజ్యసభకు నామినేషన్ వేసినట్టు చెప్పారు. కాగా, రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగిన చైతన్య రాజు, ఆదాల ప్రభాకరరెడ్డి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. వీరిద్దరి నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని ఎన్నికల కమిషన్ తేల్చింది. -
'29 తర్వాత కొత్త పార్టీపై మాట్లాడదామన్న సీఎం'
సీఎం కొత్త పార్టీ పెడితే అందులో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. కిరణ్ పార్టీ పెట్టని నేపథ్యంలో మరో పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 29 తర్వాత కొత్త పార్టీ ఏర్పాటుపై మాట్లాడదామని తనతో సీఎం వెల్లడించిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ దూసుకువెళ్తుంది. ఈ నేపథ్యంలో సీమాంధ్రలో ఆ పార్టీకి డిపాజిట్లు గల్లంతవుతాయని కాంగ్రెస్ నాయకులలో జోరుగా ప్రచారం సాగుతుంది. దాంతో సీఎం కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేస్తారని పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే.