'29 తర్వాత కొత్త పార్టీపై మాట్లాడదామన్న సీఎం' | CM will discuss on new party after 29 this month, says Adala Prabhakara Reddy | Sakshi
Sakshi News home page

'29 తర్వాత కొత్త పార్టీపై మాట్లాడదామన్న సీఎం'

Published Wed, Jan 8 2014 11:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

CM will discuss on new party after 29 this month, says Adala Prabhakara Reddy

సీఎం కొత్త పార్టీ పెడితే అందులో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. కిరణ్ పార్టీ పెట్టని నేపథ్యంలో మరో పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 29 తర్వాత కొత్త పార్టీ ఏర్పాటుపై మాట్లాడదామని తనతో సీఎం వెల్లడించిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 

రానున్న ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ దూసుకువెళ్తుంది. ఈ నేపథ్యంలో సీమాంధ్రలో ఆ పార్టీకి డిపాజిట్లు గల్లంతవుతాయని కాంగ్రెస్ నాయకులలో జోరుగా ప్రచారం సాగుతుంది. దాంతో సీఎం కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేస్తారని పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement