
సాక్షి, నెల్లూరు : చంద్రబాబు నాయుడుకు ఓటమి తప్పదని తెలిసిపోయిందని, అందుకే వంగి, వంగి దండాలు పెడుతున్నారని నెల్లూరు వైఎస్సార్ సీపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నెల్లూరులో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ నేతలు డబ్బు, మద్యాన్ని విచ్చల విడిగా పంచుతున్నప్పటికి ప్రజలు మాత్రం వైఎస్సార్ సీపీకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం కడతానని చెప్పినా కమీషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఆరోపించారు. ప్రచారం కోసం ఎక్కడికి వెళ్లినా ప్రజలు వైఎస్ జగన్‌ను కోరుకుంటున్నారని, వైఎస్సార్ సీపీకి 150 కి పైగా అసెంబ్లీ, 22 లోక్ సభ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు ఎంతో తేడా ఉందన్నారు. గత ఐదేళ్లుగా టీడీపీ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి మేలు చేయలేదని, అందుకు ప్రజలు టీడీపీపై కోపంగా ఉన్నారనన్నారు. వైఎస్ జగన్‌కు ఓటు వేటు వేయాలనిఅన్ని వర్గాల ప్రజలు 15 రోజుల ముందే నిర్ణయించుకున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment