తూర్పుగోదావరి : శిక్షణలో ఉన్న ఫైర్ కానిస్టేబుల్ పై అడిషనల్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ (ఏడీఎఫ్‌వో) దాడి చేయడాన్ని నిరసిస్తూ అతని సహచరులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుండి 100 మంది ఫైర్ కానిస్టేబుళ్లు ఈతలో శిక్షణ నిమిత్తం రాజమండ్రికి వచ్చారు. కాగా ఆదివారం రాజమండ్రిలోని గౌతమి ఘాట్ వద్ద శిక్షణలో ఉన్న ఫైర్ కానిస్టేబుల్ రెడ్డిని ఏడీఎఫ్‌వో కృపావరం చెప్పుతో కొట్టారు. దీంతో కోపోద్రిక్తులైన సహచరులు ఎలాంటి తప్పు లేకున్నా రెడ్డిని చెప్పుతో కొట్టడాన్ని నిరసిస్తూ శిక్షణను బహిష్కరించి ఆందోళన చేపడుతున్నారు. విషయం బయటకు రాకుండా ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి గొడవ సద్దుమణిగేలా చూడడానికి ఏడీఎఫ్‌వో శతవిధాల ప్రయత్నిస్తున్నారు.