Trainee constable
-
‘నాన్న క్షమించు.. నాకు బతకడం ఇష్టం లేదు’
వేలూరు: రాణిపేట జిల్లా ఆర్కాడు తాలుకా సాత్తూరు గ్రామానికి చెందిన విఘ్నేశ్వరన్(26) కాంచీపురంలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో ట్రైనీ కానిస్టేబుల్‌గా ఉన్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో గత 10 రోజులుగా సెలవు పెట్టి స్వగ్రామంలో ఉంటున్నాడు. సోమవారం ఉదయం కాంచీపురం వెళుతున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి ప్రయాణమయ్యాడు. సాయంత్రం వాలాజ టోల్గేట్ నుంచి విఘ్నేశ్వరన్ తన తండ్రి ఏయుమలైతో సెల్ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో ‘నాన్న నన్ను క్షమించు, నాకు బతకడం ఇష్టం లేదని, ఆరోగ్యం సక్రమంగా లేదని చెప్పి’.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడున్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏయుమలై తన బంధువులతో కలిసి కారులో వాలాజ టోల్గేట్ వద్దకు చేరుకొని గాలించగా విఘ్నేశ్వరన్ ఆత్మహత్య చేసుకొని ఉండటాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. వాలాజ పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రియురాలితో గొడవపడి వ్యక్తి ఆత్మహత్య -
స్నేహితురాలి మరణాన్ని తట్టుకోలేక..
రాజేంద్రనగర్: స్నేహితురాలి మరణాన్ని తట్టుకోలేక ఓ ట్రైనీ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ఆదివారం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా ముత్యాలమ్మ గూడేనికి చెందిన నర్సింహ కూతురు నవీన (23) 2016లో కానిస్టేబుల్‌గా ఎంపికైంది. 4 నెలలుగా పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. మరో రెండు నెలల్లో శిక్షణ పూర్తి కానుంది. అయితే, నవీనకు రేములపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మాధవి ప్రాణస్నేహితురాలు. పదవ తరగతి నుంచే వీరిద్దరి అభిప్రాయాలు ఒకటి కావడంతో స్నేహం కుదిరింది. అయితే, మాధవి శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నవీన ఏడుస్తూ విశ్రాంతి గదిలోనే ఉంది. తోటి ట్రైనీ కానిస్టేబుళ్లు రాత్రి భోజనాలకు వెళ్లగానే నవీన చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో వారంతా తిరిగి వచ్చి చూసే సరికి నవీన ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. తన స్నేహితురాలు మాధవి మృతితో మనస్తాపం చెంది నవీన ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్ఐ సుధీర్ తెలిపారు. -
శిక్షణలో ఉన్న ఫైర్ కానిస్టేబుల్‌పై ఏడీఎఫ్‌వో చెప్పుతో దాడి
తూర్పుగోదావరి : శిక్షణలో ఉన్న ఫైర్ కానిస్టేబుల్ పై అడిషనల్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ (ఏడీఎఫ్‌వో) దాడి చేయడాన్ని నిరసిస్తూ అతని సహచరులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుండి 100 మంది ఫైర్ కానిస్టేబుళ్లు ఈతలో శిక్షణ నిమిత్తం రాజమండ్రికి వచ్చారు. కాగా ఆదివారం రాజమండ్రిలోని గౌతమి ఘాట్ వద్ద శిక్షణలో ఉన్న ఫైర్ కానిస్టేబుల్ రెడ్డిని ఏడీఎఫ్‌వో కృపావరం చెప్పుతో కొట్టారు. దీంతో కోపోద్రిక్తులైన సహచరులు ఎలాంటి తప్పు లేకున్నా రెడ్డిని చెప్పుతో కొట్టడాన్ని నిరసిస్తూ శిక్షణను బహిష్కరించి ఆందోళన చేపడుతున్నారు. విషయం బయటకు రాకుండా ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి గొడవ సద్దుమణిగేలా చూడడానికి ఏడీఎఫ్‌వో శతవిధాల ప్రయత్నిస్తున్నారు. -
సీఆర్పీఎఫ్ ట్రైనీ కానిస్టేబుల్ అదృశ్యం
హైదరాబాద్: హకీంపేటలో సీఆర్పీఎఫ్ ట్రైనీ కానిస్టేబుల్ అదృశ్యమైయ్యాడు. విష్ణువర్థన్ అనే ట్రైనీ కానిస్టేబుల్ జనవరి 31 గవర్నర్ పేట పోలీసు స్టేషన్లో క్యాంప్ నుంచి మిస్సింగ్ అయినట్టు అక్కడి సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ అధికారులు వెల్లడించారు. విష్ణువర్థన్ సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్లో కానిస్టేబుల్‌గా శిక్షణ పొందుతున్నాడు. విష్ణువర్థన్ ఆదిలాబాద్ వాసిగా అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సివుంది. -
గుండెపోటుతో ట్రైనీ కానిస్టేబుల్ మృతి
అనంతపురంలో ఓ కానిస్టేబుల్ మరణం వివాదానికి దారి తీసింది. పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో కానిస్టేబుల్ సుబ్బారావు గుండెపోటుతో మృతిచెందాడు. అయితే అతడి మృతికి అధికారుల వేధింపులే కారణమంటూ ట్రైనింగ్ కానిస్టేబుళ్లు ఆందోళనకు దిగారు. పశ్చిమగోదావరి జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేసే సుబ్బారావు ప్రమోషన్ కోసం ట్రైనింగ్ నిమిత్తం అనంతపురంకు వచ్చాడు. ట్రైనింగ్‌లో పాస్ కాకపోతే ప్రమోషన్ రాదని, ప్రమోషన్ రాకపోతే తోటి కానిస్టేబుళ్లు ఎగతాళి చేస్తారని సుబ్బారావు రోజు తమతో చెప్పి బాధపడేవాడని తోటి కానిస్టేబుళ్లు తెలిపారు. ఆ ఒత్తిడి తట్టుకోలేకే అతడికి గుండెపోటు వచ్చిందని అనుమానిస్తున్నారు. ఇప్పటికైనా ప్రమోషన్ల విషయంలో విధానాలు మార్చాలని వారు డిమాండ్ చేశారు.