అనంతపురంలో ఓ కానిస్టేబుల్ మరణం వివాదానికి దారి తీసింది. పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో కానిస్టేబుల్ సుబ్బారావు గుండెపోటుతో మృతిచెందాడు. అయితే అతడి మృతికి అధికారుల వేధింపులే కారణమంటూ ట్రైనింగ్ కానిస్టేబుళ్లు ఆందోళనకు దిగారు. పశ్చిమగోదావరి జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసే సుబ్బారావు ప్రమోషన్ కోసం ట్రైనింగ్ నిమిత్తం అనంతపురంకు వచ్చాడు.
ట్రైనింగ్‌లో పాస్ కాకపోతే ప్రమోషన్ రాదని, ప్రమోషన్ రాకపోతే తోటి కానిస్టేబుళ్లు ఎగతాళి చేస్తారని సుబ్బారావు రోజు తమతో చెప్పి బాధపడేవాడని తోటి కానిస్టేబుళ్లు తెలిపారు. ఆ ఒత్తిడి తట్టుకోలేకే అతడికి గుండెపోటు వచ్చిందని అనుమానిస్తున్నారు. ఇప్పటికైనా ప్రమోషన్ల విషయంలో విధానాలు మార్చాలని వారు డిమాండ్ చేశారు.