హైదరాబాద్: హకీంపేటలో సీఆర్పీఎఫ్ ట్రైనీ కానిస్టేబుల్ అదృశ్యమైయ్యాడు. విష్ణువర్థన్ అనే ట్రైనీ కానిస్టేబుల్ జనవరి 31 గవర్నర్ పేట పోలీసు స్టేషన్లో క్యాంప్ నుంచి మిస్సింగ్ అయినట్టు అక్కడి సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ అధికారులు వెల్లడించారు. విష్ణువర్థన్ సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్లో కానిస్టేబుల్గా శిక్షణ పొందుతున్నాడు. విష్ణువర్థన్ ఆదిలాబాద్ వాసిగా అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సివుంది.