బంజారాహిల్స్ (హైదరాబాద్) : కేంద్రప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటు చేయకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నేతలు శనివారం బంజారాహిల్స్‌లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కలసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని వెంటనే విభజించే విషయంలో సహకరించాలని ఆయనను కోరారు. స్పందించిన వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక న్యాయస్థానాల అంశాలను తాను పార్లమెంట్‌లో లేవనెత్తనున్నట్లు వివరించారు. ఒక వైపు పార్లమెంట్‌లో ఈ విషయం చర్చకు వస్తుండగా మళ్లీ తన ఇంటికి రావడమేమిటని ఆయన ప్రశ్నించారు. మంత్రిని కలసిన వారిలో అడ్వకేట్ జేఏసీ నాయకులు గోవర్థన్‌రెడ్డి, బద్దం నరసింహారెడ్డి, సీహెచ్ ఉపేంద్ర, దేవరాజ్, కె.గోవర్ధన్‌రెడ్డి, సదానంద్ ఉన్నారు.