వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేకే రాష్ట్ర విభజన: ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి | Afraid of jaganmohan reddy's popularity, so divided state, says gurunath reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేకే రాష్ట్ర విభజన: ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి

Published Wed, Aug 14 2013 1:41 PM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM

Afraid of jaganmohan reddy's popularity, so divided state, says gurunath reddy

దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ కంకణం కట్టుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి బుధవారం అనంతపురంలో ఆరోపించారు. గాంధీ పేరు పెట్టుకునే అర్హత సోనియాకు లేదని ఆయన అన్నారు. కడప ఎంపీ వైఎస్ జగన్ను ఎదుర్కొలేకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు లేఖ ఆధారంగానే సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందన్నారు. సీమాంద్రలోని ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాల్సిందేనని గుర్నాథ్రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.



అలాగే అనంతపురంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసనలు బుధవారం మిన్నంటాయి. సమైక్యాంధ్ర కోరుతూ వైఎస్ఆర్ సీపీ నేత ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్‌లో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా ఆందోళన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నగరంలోని ఎస్కేయూలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఆంటోని కమిటీ గో బ్యాక్ అంటూ ఆంటోనీ సెల్ నెంబర్కు అనంతపురం జిల్లాలోని వేలాది మంది ఉపాధ్యాయులు వేల సంఖ్యలో మెసేజ్లు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement