
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై అవాస్తవ ఆరోపణలు
ఆయనే దాడి చేయించుకున్నారంటూ మళ్లీ డైవర్షన్ రాజకీయం
వైఎస్ వివేకా హత్యపైనా అవాకులు చవాకులు
దస్తగిరి వాంగ్మూలం వల్లె వేస్తూ విషం కక్కుతున్న వైనం
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్కసు వెళ్లగక్కారు. తనకు అలవాటైన రీతిలో అవాస్తవ ఆరోపణలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు టీడీఎల్పీ సమావేశం వేదికగా యత్నించారు. వైఎస్ జగన్‌పై 2018 అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనను వక్రీకరించేందుకు నిస్సిగ్గుగా యత్నించారు. వైఎస్ జగన్ తనపై తానే దాడి చేయించుకున్నారని విమర్శించడం విస్మయ పరిచింది.
ఎందుకంటే ఈ కేసులో నిందితుడు జానుపల్లి శ్రీనివాసరావు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని హత్య చేసేందుకే దాడికి పాల్పడ్డాడని కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నిర్ధారించింది. 2019 జనవరిలో న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్‌షీటులో ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది కూడా. ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని హత్య చేయాలనే ఉద్దేశంతోనే పదునైన కత్తితో ఆయనపై దాడి చేశాడు’ అని ఎన్‌ఐఏ తన నివేదికలో వెల్లడించింది.
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వమే అధికారంలో ఉండింది. నిందితుడు జానుపల్లి శ్రీనివాసరావు పని చేస్తున్న విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరి టీడీపీ నేత. ఆయన 2014 ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించారు కూడా. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడే విశాఖపట్నం విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్టు ఆయనకు దక్కింది.
నేర చరిత్ర ఉన్న జానుపల్లి శ్రీనివాసరావు పోలీసుల నుంచి నిరభ్యంతర సరి్టఫికెట్ (ఎన్‌వోసీ) పొంది ఆ రెస్టారెంట్‌లో ఉద్యోగిగా చేరడం వెనుక టీడీపీ పెద్దల ప్రమేయం ఉంది. తద్వారా వైఎస్ జగన్‌పై హత్యాయత్నం వెనుక టీడీపీ పెద్దల కుట్ర ఉందన్నది స్పష్టమవుతోంది. వాస్తవాలు ఇలా ఉంటే.. చంద్రబాబు మాత్రం వైఎస్ జగన్‌పై దు్రష్పచారానికి తెగబడటం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం.
దస్తగిరిని అడ్డుపెట్టి దు్రష్పచారం!
వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో కూడా వాస్తవాలను మరుగున పరిచేలా ముఖ్యమంతి చంద్రబాబు పాత కుట్రకు సరికొత్తగా తెరతీశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే 2019 ఎన్నికల ముందు వైఎస్ వివేకాను అత్యంత దారుణంగా హత్య చేయడం వెనుక సొంత కుటుంబ సభ్యులు, టీడీపీ పెద్దల పాత్ర ఉందన్నది సుస్పష్టం. కానీ వైఎస్ వివేకాను చంపానని ఒప్పుకున్న నిందితుడు దస్తగిరిని అప్రూవర్‌గా చేసి, అతనితో వైఎస్ కుటుంబంపై అవాస్తవ ఆరోపణలు చేయిస్తుండటం వెనుక పక్కా కుట్ర ఉందన్నది తేటతెల్లమవుతోంది.
తన తండ్రి హంతకుడు దస్తగిరితో నర్రెడ్డి సునీత దంపతులు సన్నిహితంగా ఉండటం.. దస్తగిరిని టీడీపీ వెనకేసుకు వస్తుండటం ఇందుకు నిదర్శనం. దస్తగిరిని అప్రూవర్‌గా చేసి అతనితో ఇప్పించిన వాంగ్మూలం పూర్తిగా అబద్ధాల పుట్ట అన్నది బట్టబయలైంది. బెంగళూరులో భూ సెటిల్‌మెంట్ ద్వారా వచ్చే రూ.40 కోట్ల కోసమే వైఎస్ వివేకాను హత్య చేయాలని ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పినట్టు దస్తగిరి తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. హత్య చేస్తే తనకు రూ.5 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసి అడ్వాన్స్‌గా రూ.కోటి ఇచ్చారని కూడా చెప్పారు.
కానీ అవన్నీ అవాస్తవాలని సీబీఐ దర్యాప్తులోనే వెల్లడైంది. బెంగళూరు భూ సెటిల్‌మెంట్ అన్నది లేనే లేదని సీబీఐ నిర్ధారించింది. ఇక వైఎస్ వివేకా హత్యకు రెండు రోజుల ముందు కూడా దస్తగిరి డబ్బులకు తీవ్ర ఇబ్బందులు పడినట్టు వెల్లడైంది. కనీసం రూ.2 వేలు అప్పు ఇప్పించమని అతను తన స్నేహితుడు సునీల్ యాదవ్‌కు పంపిన వాట్సాప్ సందేశాలు బయటపడ్డాయి. కనీసం రూ.500 అయినా ఇవ్వాలని ప్రాథేయపడ్డాడు కూడా.
దస్తగిరి రూ.కోటి అడ్వాన్స్‌గా తీసుకుని ఉంటే రూ.500 కోసం సునీల్ యాదవ్‌ను అంతగా ఎందుకు ప్రాథేయపడ్డాడన్నది కీలకాంశం. అంటే అతని వద్ద చిల్లి గవ్వ కూడా లేదని నిర్ధారణ అయ్యింది. అటువంటి దస్తగిరి అప్రూవర్‌గా మారగానే అతని జీవన శైలి ఒక్కసారిగా మారిపోయింది. ఖరీదైన కార్లు, జేసీబీలు కొనుగోలు చేశాడు. విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. దర్జాగా సెటిల్‌మెంట్లు చేస్తున్నాడు. ఢిల్లీ నుంచి సిద్ధార్థ లూథ్రా వంటి అత్యంత ఖరీదైన న్యాయవాదులు అతని తరఫున న్యాయస్థానంలో వాదించేందుకు వస్తున్నారు.
ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయంటే వైఎస్ అవినాశ్ రెడ్డి కుటుంబంపై దు్రష్పచారం చేస్తూ అప్రూవర్‌గా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడం వల్లే. ఆ అబద్ధపు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని చంద్రబాబు, ఆయన ముఠా వైఎస్ జగన్‌పై దు్రష్పచారం చేస్తుండటం రాజకీయ కుట్రేనన్నది సుస్పష్టం.
Comments
Please login to add a commentAdd a comment