‘సకల జనభేరి’మోగిద్దాం | again telangana movement may raise | Sakshi

‘సకల జనభేరి’మోగిద్దాం

Sep 21 2013 2:27 AM | Updated on Apr 7 2019 3:47 PM

ఈ నెల 29న హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో నిర్వహించనున్న సకల జనభేరి సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు


 నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్ : ఈ నెల 29న హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో నిర్వహించనున్న సకల జనభేరి సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని పెన్షనర్స్ భవన్‌లో జిల్లా జేఏసీ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జిల్లా కమిటీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ఏర్పాటు చేయాలని, కేంద్ర కేబినెట్ తీర్మానం చేసి పార్లమెంట్‌లో ఆమోదం చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో తీర్మానం పెట్టేవరకు ఈ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బాధ్యత తీసుకోవాలన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సీఎం, డీజీపీలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్ గోలి అమరేందర్‌రెడ్డి, న్యూడెమోక్రసీ నాయకుడు జె.జనార్దన్, మాలె శరణ్యారెడ్డి, శ్రవణ్‌కుమార్, జి.భీమయ్య, లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, భువనగిరి దేవేందర్, ధర్మార్జున్, సంతోష్‌రెడ్డి, రంగాచారి, పాండురంగారావు, బొమ్మరబోయిన నాగార్జున, కట్టా శ్రీను, వెంకన్న, కత్తుల వెంకటేశం, గిరి, సైదులు, జమీల్‌ఖాద్రి, మైనం శ్రీనివాస్, గణేష్, నవీన్, రమేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.  
 
 సమావేశంలో చేసిన తీర్మానాలు
     23న ఇంటింటి ప్రచారం, కరపత్రాలు, గోడ పత్రికలు ఆవిష్కరణ, ఉపాధ్యాయుల ర్యాలీ
     24న మండల, నియోజకవర్గస్థాయిలో కళాశాలల్లో సదస్సులు
     25న విద్యార్థుల ర్యాలీలు, మహిళలతో రణభేరి ర్యాలీలు
     26న సంతకాల సేకరణ, ప్రచారం, గ్రామాల్లో యువజన ర్యాలీలు
     27న నల్లగొండలో నిర్వహించే టీఎన్‌జీఓల రణభేరి సదస్సు విజయవంతం చేయాలి
     28న సకల జనభేరి విజయవంతం కోసం ఎక్కడికక్కడ బైక్ ర్యాలీ నిర్వహించడం.
     29న నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement