ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్కు గ్రీన్ సిగ్నల్ | Telanana government gives nod to LRS, BRS | Sakshi
Sakshi News home page

ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్కు గ్రీన్ సిగ్నల్

Published Mon, Nov 2 2015 4:41 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్కు గ్రీన్ సిగ్నల్ - Sakshi

ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్కు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: ఎప్పటి నుంచో హైదరాబాద్ నగర వాసులు ఎదురు చూస్తున్న ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 28ని కటాఫ్ డేట్గా  నిర్ణయించింది. అక్టోబర్ 28 నుంచి రెండు నెలల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. 10 వేల రూపాయలు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్రమ భవనాలను క్రమబద్ధీకరించుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. చార్జీలు ఈ విధంగా ఉన్నాయి.

బీఆర్ఎస్ క్రమబద్ధీకరణ చార్జీలు

  •     600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపు ఫ్లాట్కు కనీస ఛార్జీ 12,500 రూపాయలు
  •     601 - 1200 చ.అ విస్తీర్ణంలోపు ఫ్లాట్కు రూ. 25,000
  •     1201 - 2000 చ.అ విస్తీర్ణంలోపు ఫ్లాట్కు 40,000
  •     2000 చ.అ. పైన విస్తీర్ణం గల ఫ్లాట్కు రూ. 60,000
  •     గృహ అవసరాలు, వాణిజ్య సముదాయాలకు వేర్వేరు చార్జీలు వర్తిస్తాయి.


ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ చార్జీలు

  • 100 లోపు చదరపు మీటర్ల ఫ్లాట్కు ప్రతి చ.మీ.కు రూ.200 చార్జీ
  • 101-200 చదరపు మీటర్ల ఫ్లాట్కు ప్రతి చ.మీ.కు రూ. 400
  • 301-500 చదరపు మీటర్ల ఫ్లాట్కు ప్రతి చ.మీ.కు రూ.600
  • 500పైన చదరపు మీటర్ల ఫ్లాట్కు ప్రతి చ.మీ.కు రూ.750
  • మురికివాడల్లో నివసించే వారి స్థలాల క్రమబద్ధీకరణకు ప్రతి చ.మీ.కు 5 రూపాయల చార్జీ వసూలు
  • ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ దరఖాస్తులకు 6 నెలల్లోపు ఆమోదం
  • భవిష్యత్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు
  • అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement