తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రద్దీ రాను రానూ అధికం కావడంతో హైదరాబాద్ తదితర నగరాల్లో రోడ్లను దాటడం వృద్ధులకు, పిల్లలకు, వికలాంగులకు చాలా ఇబ్బందిగా ఉంటోంది. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో రోడ్డు దాటడం చాలా కష్టమైపోతోంది.
ఇలా అధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో జీబ్రా క్రాసింగులను వీలైనన్ని చోట్లలో ఏర్పాటు చేస్తే పాదచారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ సంఖ్యను కూడా పెంచాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించి పాదచారులకు ప్రయోజనం కలిగించాలని కోరుతున్నాను.
-ఈదునూరి వెంకటేశ్వర్లు, నెక్కొండ, వరంగల్
జీబ్రా క్రాసింగులేవి?
Published Thu, Sep 21 2017 1:53 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement