పాలక మండలి లేకుండానే.. ఆరేళ్లు | Six years without the board of directors .. | Sakshi
Sakshi News home page

పాలక మండలి లేకుండానే.. ఆరేళ్లు

Published Wed, Jul 16 2014 3:24 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

పాలక మండలి లేకుండానే..  ఆరేళ్లు - Sakshi

పాలక మండలి లేకుండానే.. ఆరేళ్లు

శాతవాహన యూనివ ర్సిటీ : శాతవాహన విశ్వవిద్యాలయం పాలక మండలి లేకుండానే ఆరో వసంతంలోకి అడుగిడింది. వర్సిటీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే పాలక మండలి ఏర్పాటు గురించి నాటి నుంచి నేటి వరకు పాలకులు కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో విశ్వవిద్యాలయం అభివృద్ధి, నిధులు, విధులు, అధ్యాపకులు, సిబ్బంది నియామకాలు వంటి అనేక విషయాల్లో వైస్‌చాన్సలర్  హైదరాబాద్‌కు పరుగెత్తవలసి వస్తోంది. తెలంగాణ రాష్ర్టంలోనైనా పాలక మండలి ఏర్పాటవుతుందని వర్సిటీ అధికారులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
 
 ఫైల్ పక్కకు 2008లో కరీంనగర్ శివారు మల్కాపూర్ రోడ్డులో శాతవాహన విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. వర్సిటీ ప్రారంభమై ఆరేళ్లు గడుస్తున్నా దీనిపై పాలకులు దృష్టి సారించలేదు. పాలక మండలి ఏర్పాటు చేసి ఉంటే ఇప్పటివరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండేదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. యూనివర్సిటీ మొదటి వీసీ ఇక్బాల్ అలీ హయాంలో ఓసారి పాలకమండలి ఏర్పాటుపై చర్చ జరిగింది. సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి ఫైల్‌ను ప్రభుత్వానికి పంపారు. ఓ మాజీ మంత్రి సోదరుడిని విద్యావేత్తల విభాగంలో మండలి సభ్యుడిగా నియమించడానికి విచారణ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ.. పాలక మండలి ఏర్పాటు ప్రక్రియ అంతటితోనే నిలిచిపోయింది.
 
 అనంతరం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి భేదాభిప్రాయాలతో మండలి ఫైల్ పక్కకు పోయింది. కొద్దినెలల క్రితం జంబోజెట్ రూపంలో అకడమిక్ సెనెట్‌ను ఏర్పాటు చేశారు. పాలక మండలి ఏర్పడిన అనంతరం వేయాల్సిన సెనెట్ కమిటీని ముందే వేయడంపై విమర్శలు వ్యక్తమయ్యూరుు. ఇక్బాల్ అలీ హయాంలో రూపొందించిన పాలక మండలి ఫైల్ ఎక్కడ ఉందో.. దాని ప్రోగెస్ ఏమిటో నేటికీ విశ్వవిద్యాలయ అధికారులకు సైతం తెలియడం లేదంటే కొత్త వర్సిటీలపై పాలకులు ఏ మేరకు దృష్టి పెట్టారో అర్థమవుతోంది.
 
 ఏ నిర్ణయమైనా పరుగెత్తాల్సిందే..
 విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా హైదరాబాద్‌లోని మానిటరింగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిటీ(ఎండీసీ) వద్దకు వర్సిటీ అధికారులు పరుగుతీయాల్సి పరిస్థితి నెలకొంది. స్థానికంగా ఉన్న సమస్యలు కమిటీ సభ్యులకు వివరించినా కొన్ని సందర్భాల్లో వాటి పరిష్కార దిశగా నిర్ణయాలు చేయడంలో జాప్యం జరుగుతోంది. అలాగే కొత్త వర్సిటీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు అనేకం ఉంటాయి. వాటి ఆర్థికపరమైన అంశాల కోసం వైస్‌చాన్సలర్ హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. విద్యార్థులకు అన్ని హంగులతో కూడిన హాస్టల్ నిర్మాణం కావాల్సి ఉంది. విద్యాభ్యాసంలో ముఖ్యమైన లైబ్రరీ ఏర్పాటు, భవనాల నిర్మాణం, ఇంజినీరింగ్ కళాశాల మంజూరుకు నిధులు రావాల్సి ఉంది. అదే పాలక మండలిని ఏర్పాటు చేస్తే సమావేశాలు ఇక్కడే నిర్వహించి.. సమస్యలు, అభివృద్ధి విషయంలో త్వరతగతిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుందని విద్యావేత్తల అభిప్రాయం.
 
 ఎగ్జిక్యుటివ్ కౌన్సిల్‌లో ఉండేది వీరే...
 క్లాస్-1 విభాగంలో : ఎక్స్ అఫిషియో మెంబర్స్‌గా యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్, రెక్టార్, విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి, ఫైనాన్స్ విభాగ ప్రభుత్వ కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ డెరైక్టర్/కళాశాల విద్యా కమిషనర్ కీలకపాత్రగా ఉంటారు.
 
 క్లాస్-2 విభాగంలో : వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్, సీనియర్ అధ్యాపకుడు, వర్సిటీ నుంచి గుర్తింపు పొందిన కళాశాల ప్రిన్సిపాల్, మరొక అధ్యాపకుడు సభ్యులుగా ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వీరితోపాటు పారిశ్రామిక రంగంలో కృషి చేసిన పారిశ్రామికవేత్త, విద్య, వ్యవసాయం, ట్రేడ్ కామర్స్, పబ్లిక్ లైఫ్, న్యాయ, సామాజిక సేవారంగం వంటి వివిధ రంగాల్లో కృషి చేసిన వారిని పాలక మండలిలో సభ్యులుగా ఎంపిక చేసే వీలుంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement