‘మీసేవ’లో వ్యవసాయం | Agriculture information is available in mee seva | Sakshi
Sakshi News home page

‘మీసేవ’లో వ్యవసాయం

Published Wed, Nov 20 2013 4:36 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Agriculture information is available in mee seva

సాక్షి, నిజామాబాద్:  వ్యవసాయ సేవలను ఇకపై మీ సేవ కేంద్రాల ద్వారా రైతులకు అందించేందుకు ఆ శాఖ సన్నద్ధమవుతోంది. యాం త్రీకరణ వంటి పథకాలతో పాటు విత్తనాలు, ఎరువుల పంపిణీని కూడా మీసేవ కేంద్రాల ద్వారానే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, ఆర్టీఏ కార్యాలయాల్లో వివిధ సర్టిఫికెట్లను ఈ కేంద్రాల ద్వారా జారీ చే స్తున్నారు. తాజాగా వ్యవసాయశాఖ సేవలను కూడా ఈ కేంద్రాల పరిధిలోకి తేవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ రబీ సీజను ముగిసేలోపు సేవలను రైతన్నలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. పెలైట్ ప్రాజెక్టు కింద  డిచ్‌పల్లి వ్యవసాయ డివిజన్‌ను ఎంపిక చేశారు. డివిజన్ పరిధిలోని జక్రాన్‌పల్లి, ధర్పల్లి, డిచ్‌పల్లి మండలాల్లో ముందుగా ప్రాజెక్టును అమ లు చేస్తారు. సాంకేతిక పరమైన, మరేవైనా లోటుపాట్లు తలెత్తితే వాటిని సరిచేసి జిల్లా అం తటా అమలు చేయాలని భావిస్తున్నారు. ఇం దులో భాగంగా డిచ్‌పల్లి ఏడీఏ రవీందర్‌తో పా టు, నలుగురు వ్యవసాయాధికారులకు శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన శిక్షణ తరగతులకు కూడా వీరు హాజరయ్యారు.
 ముందుగా మూడు రకాల సేవలు
 మీసేవా కేంద్రాల ద్వారా ముందుగా మూడు రకాల వ్యవసాయ సేవలను అందిస్తారు. సబ్సి డీ విత్తనాల పంపిణీ, పంటల బీమా, వ్యవసాయ యాంత్రీకరణ పథకం దరఖాస్తులను మీసేవా ద్వారా స్వీకరించి, వాటి ద్వారానే లబ్ధిదారులకు మంజూరు పత్రాలను జారీ చేస్తారు. రైతులు నేరుగా మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. వ్యవసాయాధికారు లు నిర్ణీత సమయంలో ఈ సేవలను రైతులకు అందించాల్సి ఉంటుంది. ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాజెక్టు జిల్లా అంతటా అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అమలైతే రైతన్నల ఇక్కట్లు చాలామట్టుకు తగ్గుతాయని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నా రు. ఈనెలాఖరు వరకు ప్రాజెక్టు రైతులకు అం దుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ నర్సింహ ‘సాక్షి’తో పేర్కొన్నారు.
 రైతుల కష్టాలకు ఇక చెక్...
 సబ్సిడీ విత్తనాల కోసం రైతులు ఇకపై వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు. రద్దీ ఎక్కువైనే బారులు తీరాల్సిన పనిలేదు. యాంత్రీకరణ పథకం కింద సబ్సిడీపై యంత్రాలను పొందాలనుకునే అన్నదాతలు ఆయా మండలాల ఏఓ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
  బ్యాంకు రుణాలు పొందని రైతులు మీసేవా కేంద్రాల ద్వారానే తమ పంటలకు బీమా చేయించుకునే సదుపాయం కల్పిస్తారు.  మొత్తం మీద వ్యవసాయశాఖ అధికారులతో ప్రత్యక్షంగా సంబంధం లేకుండానే పనులు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా పారదర్శకత పెరగడమే కాకుండా, అవినీతి అక్రమాలకు చాలామట్టుకు చెక్‌పడుతుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement