12, 13 తేదీల్లో అఖిలపక్ష సమావేశం
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రక్రియను ప్రజాస్వామ్యబద్ధంగా చేపడుతున్నట్లు సంకేతాలివ్వడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా విభజన ప్రక్రియలో తదుపరి నిర్ణయం తీసుకునే ముందు మరోసారి అఖిలపక్ష సమావేశాన్నిఏర్పాటు చేసింది. ఈ నెల 12, 13 తేదీల్లో అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర హోంశాఖ ఖరారు చేసింది. అభిప్రాయాలు తెలియచేయాలని రాష్ట్రంలోని మొత్తం ఎనిమిది పార్టీలకు కేంద్రం లేఖ రాసింది.
12వ తేదీన నాలుగు పార్టీలకు, 13న మరో నాలుగు పార్టీలకు అపాయింట్మెంట్ ఇచ్చింది. జీవోఎం విడివిడిగా అభిప్రాయాలను సేకరించనుంది. రాష్ట్ర విభజనకు కేబినెట్ ఆమోదించిన విధి విధానాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటిపై రాష్ట్ర పార్టీల అభిప్రాయాన్ని తీసుకోవాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించిన విషయం తెలిసిందే.