రామగుండం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో జెన్‌కో ఆధ్వర్యంలో కొనసాగుతున్న 62.5మెగావాట్ల సామర్థ్యం గల బీ-థర్మల్ విద్యుత్ కేంద్రం విద్యుదుత్పాదనలో కీలకం కా నుంది. స్థానికంగా రెండు వేల మెగావాట్లకు విస్తరించేందుకు స్థలం అందుబాటులో ఉండడం, రెండు రాష్ట్రాలుగా విభజన తప్పనిసరి కానుండడంతో రాష్ట్ర ప్ర భుత్వం విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారిం చింది. ఈ నేపథ్యంలో నలభై ఏళ్ల క్రితం నాటి పురాతన సాంకేతిక పరిజ్ఞానానికి స్వస్తి పలికి 660 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లను (1,320మెగావాట్లు) ఏర్పాటు చేయాలని తలపెట్టింది. బీ-థర్మల్‌ను విస్తరించి నిరుద్యోగాన్ని రూపుమాపాలని రెండేళ్లుగా అఖిలపక్ష కమిటీ ఉద్యమాలు చేస్తోంది. దీంతో అధికార పార్టీ నేతలు తమ స్వార్థ రాజకీయాలతో బీ-థర్మల్‌ను విస్తరించాలని ముఖ్యమంత్రితో ప్రకటన చేయించారు.
స్థానికంగా వస్తున్న ఒత్తిడితో పాటు రాష్ట్ర విభజన నేపథ్యంలో బీ-థర్మల్ విస్తరణ అనివార్యంగా మారనుంది. జెన్‌కో విద్యుత్ కేం ద్రాలకు ‘సీ’గ్రేడ్ బొగ్గును మధ్యప్రదేశ్‌లోని సులిమారి కోల్ బ్లాక్ నుంచి దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదిరిన ట్లు రెండు రోజుల క్రితం జెన్‌కో డెరైక్టర్ (ప్రాజెక్టు) రాధాకృష్ణ ఖమ్మం జిల్లాలో ప్రకటించారు. జెన్‌కో ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యుత్ కేంద్రాల విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్న జాబితాలో బీ-థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రథమ వరుసలో ఉండడంతో స్థానికంగా నిరుద్యోగులకు ఆశలు చిగురిస్తున్నాయి. ఆరు మా సాల క్రితమే జెన్‌కో విద్యుత్ కేంద్రానికి చెందిన స్థలాల నివేదికలు తదితర అంశాలకు సంబంధించిన నివేదికలను విద్యుత్‌సౌధలోని సివిల్ విభాగానికి అప్పగించినట్లు తెలిసింది. జెన్‌కో ఆధ్వర్యం లో వచ్చే ఐదేళ్లలో రెండింతల విద్యుత్ ఉత్పత్తి పెంచాలని యోచిస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతు న్నారు.
బీ-థర్మల్ విస్తరణకు మోక్షం!
Published Tue, Aug 27 2013 6:04 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement