'మీ ఆదాయాలను రైతులకు పంచుతారా?'
గుంటూరు: ఏపీ రాజధాని ప్రాంతానికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటించాకే రైతుల కష్టాలు బయట ప్రపంచానికి తెలిశాయని మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలపారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే.. భూ సమీకరణకు మూడు సార్లు గడువు ఎందుకు పెంచారన్నారు.
భూ సేకరణ చేస్తామంటూ రైతులను బెదిరించాల్సిన అవసరంమేంటన్నారు. 2018 నాటికి రాజధానిలో మొదటి విడత నిర్మాణాలు పూర్తైతే, ఈ మూడేళ్లలో రైతులు, కూలీలు పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు హెరిటేజ్ సంస్థ నుంచి వచ్చే ఆదాయాన్ని, మంత్రి నారాయణ కాలేజీల నుంచి వచ్చే ఆదాయాన్ని రైతులకు, కూలీలకు పంచుతారా అని ఆయన అడిగారు.