'బాబూ.. మీ పేరు సింగపూర్ నాయుడుగా మార్చుకోండి' | Ambati Rambabu lashes out at chandrababu | Sakshi
Sakshi News home page

'బాబూ.. మీ పేరు సింగపూర్ నాయుడుగా మార్చుకోండి'

Published Wed, Nov 12 2014 4:33 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

'బాబూ.. మీ పేరు సింగపూర్ నాయుడుగా మార్చుకోండి' - Sakshi

'బాబూ.. మీ పేరు సింగపూర్ నాయుడుగా మార్చుకోండి'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత పనుల కోసమే సింగపూర్ పర్యటనకు వెళ్లారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబుకు చెందిన వ్యాపారాలు, హోటళ్లు సింగపూర్లో ఉన్నాయని తెహల్కా వెల్లడించిందని అంబటి అన్నారు. చంద్రబాబు-సింగపూర్ల వైఖరి దృఢమైనదని ఆరోపించారు.

చంద్రబాబు తన పేరును సింగపూర్ నాయుడుగా మార్చుకుంటే మంచిదని అంబటి వ్యాఖ్యానించారు. చంద్రబాబు సింగపూర్ పర్యటనకు ఇంత ఆర్భాటాలు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి ఓ వైపు ప్రజల నుంచి చందాలు అడుగుతూ.. చంద్రబాబు బృందం రెండు ప్రత్యేక విమానాల్లో సింగపూర్ పర్యటనకు వెళ్లాల్సిన అవసరమేంటని అంబటి రాంబాబు విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement