అంబేడ్కర్‌పై కపట ప్రేమ వైఎస్సార్‌సీపీ ధ్వజం
డాబాగార్డెన్స్ (విశాఖ) : ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు అధికారం చేపట్టి 18 నెలల తర్వాత భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబా సాహేబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గుర్తొచ్చినట్టుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఎద్దేవా చేశారు. అంబేడ్కర్‌పై అభిమానమే ఉంటే దళితులు, బడుగు, బలహీన వర్గాల కోసం ఆ మహనీయుడి పేరిట ఒక పథకమైనా ప్రవేశపెట్టారా? అని ప్రశ్నించారు. కాల్‌మనీ కేసును పక్కదోవ పట్టించడానికి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా బాబా సాహెబ్‌ను రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకోవడం దురదృష్టకరమని చెప్పారు. ఈ సంఘటనను నిరసిస్తూ అధిష్టానం పిలుపు మేరకు పార్టీ జిల్లా క్యాడర్ శుక్రవారం డాబాగార్డెన్స్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని చర్చకు రానీయకుండా అంబేడ్కర్ గురించి, రాజ్యాంగం గురించి చర్చిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఇరుక్కుని చిక్కుల్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీని, ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అంబేడ్కర్‌ను అడ్డు పెట్టుకున్నది టీడీపీయేనన్నారు. మంత్రులు రావెల కిశోర్‌బాబు, పీతల సుజాత, ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు దళితులై ఉండి కూడా ఇంత ఘోరాన్ని పట్టించుకోకుంటే ప్రజలు క్షమించరని నాయకులు ఆక్షేపించారు. మహిళలపై ఇన్ని దారుణాలు జరుగుతున్నా చంద్రబాబుకు కనకపడకపోవడం శోచనీయమన్నారు.
పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి తపించిన అంబేడ్కర్‌ను అడ్డు పెట్టుకుని, కాల్‌మనీ రాకెట్‌పై చర్చించకుండా అడ్డుపడడం టీడీపీకి తగదన్నారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు కోలా గురువులు, మళ్ల విజయప్రసాద్, రొంగలి జగన్నాథం, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ప్రచార కార్యదర్శి రవిరెడ్డి, నగర మైనార్టీ విభాగం అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్, ఎస్సీ సెల్ రాష్ట్ర సభ్యులు బోను శివరామకృష్ణ, యువజన విభాగం సభ్యుడు తుల్లి చంద్రశేఖర్, కార్యదర్శులు పీతల వాసు, పాల శ్రీహరిరెడ్డి, సేవాదళ్ ప్రతినిధి వాసు, ఎస్.ేహ మంత్‌కుమార్, ఇప్పాక శ్రీను పాల్గొన్నారు.
ప్రభుత్వ నయవంచన
Published Fri, Dec 18 2015 11:53 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM