రేపు అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు | Ambedkar statues to of milk the anointing of tomorrow! | Sakshi
Sakshi News home page

రేపు అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు

Published Fri, Feb 19 2016 1:23 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM

Ambedkar statues to of milk the anointing of tomorrow!

పట్నంబజారు(గుంటూరు) : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఎవరు మాత్రం ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారు ’అని వ్యాఖ్యానించడమే కాకుండా కనీస పశ్చాతాపం లేకుండా వ్యవహరించడం ఆయన అహంకారానికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ విమర్శించారు. గుంటూరు లోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన  మాట్లాడారు. చంద్రబాబు వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని, దళిత జాతిని అవమానపరిచేలా వ్యవహరించడాన్ని వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తోందన్నారు. దీనిపై ఇప్పటి వరకు చంద్రబాబు ఎటువంటి క్షమాపణలు చెప్పకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 20న జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు నిచ్చారు. శాసనసభ్యులు, ఆయా నియోజ కవర్గాల సమన్వయకర్తల పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. చంద్రబాబు క్షమాపణ చెప్పకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాపట్లలో శుక్రవారం నిర్వహించే పార్టీ కార్యకర్తల సమావేశంలో నియోజకవర్గంలోని సమస్యలు కార్యకర్తల ఇబ్బందులను తెలుసుకోవడం జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement