జమ్మలమడుగు,న్యూస్‌లైన్: గండికోట ఉత్సవాలపై పర్యాటక ప్రేమికులు ఆశలు వదులుకుంటున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలో మూడురోజుల పాటు గండికోట ఉత్సవాలను నిర్వహించాలని జిల్లా అధికారులు సంకల్పించారు. ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ. 30 లక్షల నిధులను కూడా మంజూరు చేసింది. గండికోటతో పాటు రాజంపేటలోని అన్నమయ్య విగ్రహం వద్ద, కడపలోని శిల్పారామంలో ఉత్సవాలను ఘనంగా జరిపించాలని నిర్ణయించారు.
కరవు పరిస్థితులు నెలకొన్న సమయంలో ఉత్సవాలు నిర్వహించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం కావడంతో వాయిదా వేశారు. 2013 చివరలో ఉత్సవాలను నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అప్పుడు కూడా వాయిదా పడ్డాయి. 2014 ఫిబ్రవరి 8,9తేదిల్లో గండికోట ఉత్సవాలను రెండు రోజుల పాటు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌ప్రకటించారు. అందరికీ అనుకూలమైన శని, ఆదివారాలలో ఉత్సవాలు నిర్వహించాలనుకోవడంతో ప్రజలు, విద్యార్థులు తిలకిస్తారని పర్యాటక ప్రేమికులు భావించారు. ప్రస్తుతం ఆ తేదీలు కూడా వెళ్లిపోయాయి. ఉత్సవాల నిర్వహణ అనుమానమేనని పలువురు భావిస్తున్నారు.
లేనట్లే
Published Mon, Feb 10 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement